Hilarious love story: కుక్క-పిల్లి.. ఓ ప్రేమ కథ! ‘దయచేసి మా ప్రేమకు అడ్డురాకండి’
పెట్ డాగ్‌పై చూపించే ప్రేమ హద్దులు మీరితే ఇదిగో ఇలానే ఉంటుంది. తన పెంపుడు కుక్క ఎదురింట్లోఉంటున్న పిల్లితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనే విషయం తెలుసుకున్న యజమాని ఏం చేసిందంటే..
Cat and Dog Hilarious love story: కొంత మంది తమ పెంపుడు జంతువులపై అమితమైన ప్రేమానురాగాలు కురిపిస్తుంటారు. చూసే వారికి ఎబ్బెట్టుగా అనిపించినా.. వారిలోని జంతుప్రేమ కొన్నిసార్లు తర్కాన్ని సైతం పక్కనపెట్టేస్తుంది. పెంపుడు జంతువుల కోసం లక్షల రూపాయలు దారపోసి తమ బెడ్‌రూంలో, పెట్ యానిమల్స్ కోసం ప్రత్యేకంగా బెడ్‌లను కూడా ఏర్పాటుచేసుకునేవారు లేకపోలేదు. ఐతే తన పెంపుడు కుక్క కోసం ఈ యజమాని చేసిన పని బహుశా ఈ ప్రపంచంలో మరెవ్వరూ చేసి ఉండరు. వీటిపై చూపించే ప్రేమ హద్దులు మీరితే ఇదిగో ఇలానే ఉంటుంది. తన పెంపుడు కుక్క ఎదురింట్లో ఉంటున్న పిల్లితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందనే విషయాన్ని గ్రహించిన సదరు యజమాని ఎలాగైనా ఆ ప్రేమికులను కలపాలని గట్టిగానే నిర్ణయించుకుంది. అందుకు పెద్ద లేఖ కూడా రాసింది. ప్రేమ లేఖ కాదండోయ్. ప్రేమ అనుమతి కోసం పక్కింటి పిల్లిగారి యజమానికి రాసింది..
అందులో ఏముందంటే.. ‘డియర్ నైబర్! ఇది మీకు నవ్వులాటగా అనిపించినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నా పెట్ డాగ్ మీ పెట్ క్యాట్‌తో దాదాపు 6 నెలల నుంచి ప్రేమలో ఉంది. తరచూ మీ విండో వైపే చూస్తూ ఉంటుంది. ఐతే ఈ మధ్యకాలంలో మీరక్కడ మొక్కల కుండీలు ఉంచడంతో నా డాగ్ హార్ట్ ముక్కలైంది. అయినప్పటికీ క్యాట్ కోసం విండో వైపు చూస్తూనే ఉంది. మీ ఇంటి కిటికీ దగ్గర ఉంచిన మొక్కలు మరో చోటికి మార్చితే బాగుంటుందని అనుకుంటున్నానని’ ముగించింది. లేఖను చదివి స్పందించిన క్యాట్ యజమాని విండో దగ్గరున్న మొక్కలను మరోచోటికి మార్చింది. దీంతో డ్యాగ్-క్యాట్‌లకు మొక్కల కష్టాలు తీరిపోయాయి. ఇక ఒకరినొకరు హాయిగా చూసుకోవడంతో కథ సుఖాంతమైంది. నిజానికి కుక్క, పిల్లి జాతి విరుద్ధంగా ఇష్టపడటమే విడ్డూరమైతే.. ఇక వీటి ప్రేమ కథను సీరియస్ తీసుకుని లేఖలు రాసుకున్న యజమానుల పిచ్చి పీక్ కదా! మీరేమంటారు.