Drone: సముద్రంలో కొట్టుకుపోతున్న బాలుడు.. దేవుడిలా ప్రత్యక్షమైన డ్రోన్‌.. ఏం చేసిందంటే..!

బీచ్‌లో బ‌లంగా వ‌స్తున్న అలల్లో చిక్కుకుపోయి ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా డ్రోన్‌ డ్రోన్‌ ప్రత్యక్షమైంది. సముద్రం అలల నుంచి తప్పించుకుని బ‌య‌ట‌కి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న బాలుడికి

Drone: సముద్రంలో కొట్టుకుపోతున్న బాలుడు.. దేవుడిలా ప్రత్యక్షమైన డ్రోన్‌.. ఏం చేసిందంటే..!
Drone Lifeguard
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 27, 2022 | 7:32 PM

Drone Lifeguard : సోషల్ మీడియా మనుషులకు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా అది క్షణాల్లోనే ప్రపంచానికి తెలిసిపోతుంది. అరక్షణంలో అరచేతిలోనే ప్రపంచం కనిపించేస్తుంది. అందివచ్చిన టెక్నాలజీ సాయంతో మనిషి రోజు రోజుకూ ఎన్నో అద్భుతాలు చేస్తు్న్నాడు. ఇంటర్‌నెట్‌, స్మార్ట్ ఫోన్లు మనిషి జీవితంలో ఎలా భాగమయ్యాయో.. నేడు డ్రోన్స్ కూడా మనుషులతో మరింత చేరువయ్యాయి. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్లు, ఇతర శుభాకార్యాల్లో వీడియోలు, ఫొటోలకు మాత్రమే పరిమితమైన డ్రోన్స్ మనుషుల అవరసరాలకు తగ్గట్టుగా సేవలందిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా,లాక్‌డౌన్‌ సమయంలో బాధితులకు మందుల పంపిణీలో కీలక భూమిక పోషించాయి. అలాంటి డ్రోన్‌..నడిసంద్రంలో మునిగిపోతున్న ఓ బాలుడిని రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వివరాల్లోకి వెళితే..

స్పెయిన్‌లోని వాలెన్సియాలో స‌ముద్రంలో మునిగిపోతున్న 14 ఏళ్ల బాలుడి ని డ్రోన్ లైఫ్‌గార్డ్ సురక్షితంగా ఒడ్డుకి చేర్చింది. బీచ్‌లో బ‌లంగా వ‌స్తున్న అలల్లో చిక్కుకుపోయి ఆ బాలుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా డ్రోన్‌ కాపాడింది. సముద్రం అలల నుంచి తప్పించుకుని బ‌య‌ట‌కి రావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న బాలుడికి డ్రోన్ ద్వారా లైఫ్‌జాకెట్ అందించారు. అనంతరం లైఫ్‌గార్డ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని వాడిని రక్షించారు.

ఇవి కూడా చదవండి

వాలెన్సియాకు ఉత్తరాన ఉన్న సగుంటో అనే న‌గ‌రంలో స్పానిష్ లైఫ్‌గార్డ్ సిబ్బందితో క‌లిసి జనరల్ డ్రోన్స్ వాలెన్సియా ఆధారిత కంపెనీ ప‌నిచేస్తోంది. ఇప్పుడ‌ది స్పెయిన్ అంతటా 22 బీచ్‌లలో లైఫ్‌గార్డ్‌లతో కలిసి 30కి పైగా పైలట్‌లతో డ్రోన్‌లను వర్క్ చేయడానికి అందుబాటులో ఉంచారు. ఆ టీమ్‌ ఆధ్వర్యంలో ఈ బాలుడు కూడా సురక్షితంగా రక్షించబడ్డాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!