రేపే జానకీ జయంతి.. సీతమ్మను ఇలా పూజిస్తే అష్టైశ్వార్యాలు మీ సొంతం?

Samatha

8  February 2026

జానకీ జయంతి వచ్చేసింది. శ్రీరామ చంద్రుని ధర్మపత్ని అయిన సీతమ్మ తల్లి జన్మదినాన్ని జానకీ జయంతి లేదా సీతా అష్టమి అంటారు. ఈరోజు శ్రీ సీతారాముల భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు.

జానకీ జయంతి

జనక మహారాజు కూతురు అయిన సీతమ్మ తల్లికి హిందూ మతంలో ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈమె సహనం, త్యాగానికి ప్రతీక, కష్ట సమయంలో కూడా భర్త చేయి వదలకుండా అడవులకు వెళ్లి కష్టాలు అనుభవించింది.

సీతమ్మ తల్లి

ఇక సీతమ్మ జన్మదినాన్ని ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అయితే 2026లో అష్టమి తిథి 9 ఫిబ్రవరి సోమ వారం రోజున జానకీ జయంతి జరుపుకుంటారు.

సీతమ్మ జయంతి

ఈ రోజున ఎవరు అయితే సీతారాములను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, వారికి సకల శుభాలు కలుగుతాయని, సమస్యలన్నీ తీరిపోయి, చాలా సంతోషకరమైన జీవితం గడుపుతారంట.

ప్రత్యేక పూజలు

అయితే ఈ రోజు అమ్మవారి ఆశీస్సులు పొందాలి అంటే, బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి, తల స్నానం చేసి, ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి.

బ్రహ్మముహుర్తం

తర్వాత ఒక పీట పెట్టి , దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి, సీతారాముల ఫొటో పెట్టాలి. తర్వాత చిత్ర పటాన్ని కుంకుమ, పసుపు, పూలతో అందంగా అలంకరించాలి.

ఎర్రటి వస్త్రం

తర్వాత సీతమ్మ వారికి ఎర్ర చీర, పూలు, గాజులు, సింధూరం సమర్పించి, 16 రకాల వస్తువులతో షోడ శోపచార పూజ చేయాలి.

16 రకాల వస్తువులు

ముఖ్యంగా పిండి వంటలు, పండ్లు, నైవేద్యంగా సమర్పించాలి. అమ్మవారికి నిండు మనసుతో మంత్రాలు చదువుతూ పూజ చేసి, హారతి ఇవ్వాలి. పూజ అనంతరం తప్పకుండా సీతారాముల అష్టోత్తరం పారాయణం చేయాలి.

పిండి వంటల నైవేద్యం

దీని తర్వాత ఐదుగురు లేదా తొమ్మిది మంది సుమంగళలకు పసుపు, కుంకుమ, గాజులు, పూలను దానం చేసి, అన్నదానం చేయాలి. దీని వలన అమ్మ వారి అనుగ్రహం కలుగుతుందంట.

దానధర్మాలు