ఎప్పుడూ గోధుమ చపాతీలే కాదు.. ఈ రోటీలూ ట్రై చేయండి

08 February 2026

TV9 Telugu

TV9 Telugu

చాలా మందికి చపాతీ రోజు వారి ఆహార‌మే అని చెప్ప‌వ‌చ్చు. పోష‌కాల గురించి ఆలోచించ‌కుండా గోధుమ చపాతీనే రోజూ తింటూనే ఉంటారు

TV9 Telugu

గోధుమ చపాతీ ఎక్కువ‌గా తీసుకున్న‌ప్ప‌టికీ ఇవి అంద‌రికీ ఎల్ల‌ప్పుడూ మేలు చేస్తాయ‌ని చెప్ప‌లేం. గోధుమ చపాతీల‌ని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెర‌గ‌డం, ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌డం, జీర్ణ స‌మ‌స్య‌లు, పోష‌కాహార లోపం వంటి ఇబ్బందులు వస్తాయి

TV9 Telugu

వీటికి బదులుగా తృణ ధాన్యాలు, ప‌ప్పు దినుసులు, చిరుధాన్యాల‌తో చేసిన రోటీల‌ను తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ఈ చపాతీ ఒక్కొక్క‌టి ఒక్కో రుచిని, ఆరోగ్య‌ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. గోధుమ‌ల‌కు బ‌దులుగా స‌జ్జ‌ల‌తో చేసిన రోటీల‌ను కూడా తీసుకోవ‌చ్చు. స‌జ్జ‌ల్లో ఐర‌న్, మెగ్నీషియం, ఫ్లేవ‌నాయిడ్లు, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైటో న్యూట్రియెంట్లు వంటి పోష‌కాలు ఉంటాయి

TV9 Telugu

స‌జ్జ రోటీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. శ‌రీరం బ‌లంగా త‌యార‌వుతుంది. గ్యాస్, ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లకు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది

TV9 Telugu

అలాగే జొన్న‌ల్లో కూడా ఐర‌న్, క్యాల్షియం, మెగ్నీషియం, ఫైబ‌ర్, బి విట‌మిన్లు వంటి పోష‌కాలు ఎక్కువ‌గా క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. ఇవి గ్లూటెన్ ర‌హిత‌మైన‌వి జొన్న రొట్టెల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు

TV9 Telugu

ఎముక‌ల ఆరోగ్యానికి రాగులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం ఎముక‌ల‌ను దృఢంగా చేయ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. రాగుల్లో ఫైబ‌ర్ కూడా అధికంగా ఉంటుంది

TV9 Telugu

రాగి రోటీల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెర‌గ‌డంతో పాటు శ‌రీరం దృఢంగా త‌యారవుతుంది. అలాగే మొక్క‌జొన్న‌, బియ్యం రోటీ, బేస‌న్ రోటీ, ఓట్స్ రోటీలు కూడా చేసుకోవచ్చు