TSSPDCL JLM Exam 2022: తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌! ఐదుగురు అధికారుల సస్పెన్షన్..

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి జులై 17, 2022న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఐతే ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉద్యోగులు చేతివాటం చూపి..

TSSPDCL JLM Exam 2022: తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌! ఐదుగురు అధికారుల సస్పెన్షన్..
Tsspdcl Jlm Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 28, 2022 | 8:12 PM

TSSPDCL Junior Linemen Exam 2022: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో జూనియర్ లైన్ మెన్ పోస్టుల భర్తీకి జులై 17, 2022న రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఐతే ఈ రాత పరీక్షలో విద్యుత్ సంస్థలకు చెందిన ఐదుగురు ఉద్యోగులు చేతివాటం చూపి ఉద్యోగాలు కోల్పోయారు. అధికారులు తెల్పిన సమాచారం ప్రకారం.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో పని చేస్తున్న మలక్ పెట్ ఏడీఈ మొహమ్మెద్ ఫిరోజ్ ఖాన్, విద్యా నగర్ లైన్ మెన్‌ను సపావత్ శ్రీనివాస్‌, రెతిబౌలి సెక్షన్లో ప్రైవేట్ మీటర్ రీడర్‌గా పని చేస్తున్న శ్రీ కేతావత్, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలో పని చేస్తున్న జగిత్యాల సబ్ ఇంజినీర్ షేక్ సాజన్, తెలంగాణ ట్రాన్స్ కో లో పని చేస్తున్న మిర్యాలగూడ ఏడిఈ మంగళగిరి సైదులు అనేవారిని విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు విద్యుత్ శాఖ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్ జి రఘుమా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఈయన మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలో మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడిన ఐదుగురు అధికారులను సస్పెండ్‌ చేశాం. అంతేకాకుండా వీరిపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశాం. విద్యుత్‌ సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవరైనా భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో పాటు, ఉద్యోగంలో నుంచి కూడా తొలగిస్తామని రఘుమా రెడ్డి హెచ్చరించారు.