AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Navy Agniveer Jobs 2026: ఇంటర్‌ అర్హతతో భారత నౌకాదళంలో అగ్నివీర్ (SSR) ఉద్యోగాలు.. అవివాహిత యువతకు భలే ఛాన్స్!

ఇండియన్‌ నేవీ అగ్నివీర్ (SSR) 2027 జనవరి-ఫిబ్రవరి బ్యాచ్‌ కోసం ఖాళీల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ లేదా పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణత పొందిన యువత దరఖాస్తు చేసుకోవచ్చు..

Indian Navy Agniveer Jobs 2026: ఇంటర్‌ అర్హతతో భారత నౌకాదళంలో అగ్నివీర్ (SSR) ఉద్యోగాలు.. అవివాహిత యువతకు భలే ఛాన్స్!
Indian Navy Agniveer Recruitment
Srilakshmi C
|

Updated on: Mar 12, 2026 | 7:37 AM

Share

ఇండియన్‌ ఆర్మీ ఆధ్వర్యంలోని భారత నౌకాదళం (ఇండియన్‌ నేవీ) అగ్నివీర్ (SSR) 2027 జనవరి-ఫిబ్రవరి బ్యాచ్‌ కోసం ఖాళీల భర్తీకి అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంటర్‌ లేదా పాలిటెక్నిక్‌లో ఉత్తీర్ణత పొందిన యువత దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు మార్చి 14, 2026వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 50 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ లేదా 10+2లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఏదైనా గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ నుంచి ఏదైనా ఇంజనీరింగ్ విభాగంలో 50 శాతం మార్కులతో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో రెండేళ్ల వొకేషనల్ కోర్సు చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధుల వయోపరిమితి 2027 జనవరి బ్యాచ్ అభ్యర్థులు తప్పనిసరిగా డిసెంబర్ 1, 2004 నుంచి మే 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. ఇక 2027 ఫిబ్రవరి బ్యాచ్ అభ్యర్ధులు మే 1, 2005 నుంచి అక్టోబర్ 31, 2009 మధ్య జన్మించి ఉండాలి. అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపిక అనంతరం ట్రైనింగ్, నాలుగేళ్ల సేవా కాలంలోనూ అభ్యర్ధులు వివాహం చేసుకోకూడదు. ఈ అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో ఏప్రిల్‌ 6, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము కింద రూ.550తోపాటు జీఎస్టీని ప్రతి ఒక్కరూ చెల్లించవల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ ఇలా..

ఎంపిక ప్రక్రియ మొత్తం రెండు దశల్లో ఉంటుంది. స్టేజ్‌ 1 INET పరీక్ష మే 2026లో ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ అవేర్‌నెస్ విభాగాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 చొప్పున కోత విధిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారిని స్టేజ్‌ 2లో ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (PFT)కి పిలుస్తారు. అనంతరం మెడికల్ ఎగ్జామినేషన్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటాయి. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 చొప్పున జీతంతోపాటు వార్షిక ఇంక్రిమెంట్ అందిస్తారు. నాలుగేళ్ల సేవ తర్వాత వడ్డీతో కలిపి సుమారు రూ.10.04 లక్షల ‘సేవా నిధి’ ప్యాకేజీ కూడా అందిస్తారు. సర్వీస్‌ కాలంలో రూ.48 లక్షల నాన్-కంట్రిబ్యూటరీ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ వర్తిస్తుంది. ఇతర వివరాలు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇండియన్‌ నేవీ అగ్నివీర్ (SSR) 2027 ఉద్యోగాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఓటీటీలపై సౌత్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇకపై కొత్త సినిమాలు..
ఓటీటీలపై సౌత్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం.. ఇకపై కొత్త సినిమాలు..
మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..!
మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు..!
భారత నౌకాదళంలో అగ్నివీర్ (SSR) ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు
భారత నౌకాదళంలో అగ్నివీర్ (SSR) ఉద్యోగాలు.. ఇంటర్‌ పాసైతే చాలు
త్వరలోనే పట్టాలెక్కనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు
త్వరలోనే పట్టాలెక్కనున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు
అబ్బ సాయిరాం.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
అబ్బ సాయిరాం.. గ్యాస్ సరఫరాపై కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్
క్రెడిట్‌ కార్డ్‌ అతిగా వాడితే ఇంత డేంజరా?
క్రెడిట్‌ కార్డ్‌ అతిగా వాడితే ఇంత డేంజరా?
హాలీవుడ్‌లో ఉన్నా ‘ఘర్ కా ఖానా’ అంటే ప్రాణం! ప్రియాంకకు నచ్చిన
హాలీవుడ్‌లో ఉన్నా ‘ఘర్ కా ఖానా’ అంటే ప్రాణం! ప్రియాంకకు నచ్చిన
మేకప్ లేకుండా మెరిసిపోవాలా? గ్లామర్ క్వీన్ చెప్పిన బ్యూటీ టిప్స్‌
మేకప్ లేకుండా మెరిసిపోవాలా? గ్లామర్ క్వీన్ చెప్పిన బ్యూటీ టిప్స్‌
ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!
ఇది తెలిస్తే ఎప్పుడు కూడా ఈ వస్తువులను గిఫ్ట్‌గా అస్సలు ఇవ్వరు!
వంటగదిలో చేసే చిన్న పొరపాట్లకు చెక్ పెట్టండిలా!
వంటగదిలో చేసే చిన్న పొరపాట్లకు చెక్ పెట్టండిలా!