AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Internship 2026: రూ. 10 లక్షల స్టైఫండ్‌తో గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్.. ఈ అర్హతలుంటే చాలు.. నక్కతోక తొక్కినట్టే!

ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌లో పనిచేయడం ప్రతి విద్యార్థికి ఒక కల. ఆ కలను సాకారం చేసే దిశగా గూగుల్ 2026 వేసవి కాలానికి గానూ 'పబ్లిక్ పాలసీ ఫెలోషిప్/ఇంటర్న్‌షిప్' ప్రోగ్రామ్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు నేరుగా ప్రజా ప్రయోజన సంస్థలతో కలిసి పనిచేస్తూ, ఇంటర్నెట్ మరియు టెక్నాలజీకి సంబంధించిన గ్లోబల్ పాలసీలపై ఆచరణాత్మక అనుభవాన్ని పొందే అవకాశం ఉంది.

Google Internship 2026: రూ. 10 లక్షల స్టైఫండ్‌తో గూగుల్ సమ్మర్ ఇంటర్న్‌షిప్.. ఈ అర్హతలుంటే చాలు.. నక్కతోక తొక్కినట్టే!
Google Summer Internship
Bhavani
|

Updated on: Mar 11, 2026 | 3:23 PM

Share

గూగుల్ ఇచ్చే ఈ ఇంటర్న్‌షిప్ కేవలం అనుభవాన్ని మాత్రమే కాదు, కళ్లు చెదిరే స్టైఫండ్‌ను కూడా అందిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు గరిష్టంగా $12,000 (సుమారు రూ. 10 లక్షలు) వరకు లభిస్తుంది. అయితే, దీనికి కొన్ని ప్రత్యేక అర్హతలు మరియు నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా వాషింగ్టన్, డిసి కేంద్రంగా సాగే ఈ ఫెలోషిప్‌లో అండర్ గ్రాడ్యుయేట్ నుండి పీహెచ్‌డీ విద్యార్థుల వరకు ఎవరైనా చేరవచ్చు. మరి అర్హతలేంటి? అప్లికేషన్ డెడ్ లైన్ ఎప్పుడు? ఆ వివరాలు ఇప్పుడు మీకోసం సవివరంగా..

1. ఎవరెవరు అర్హులు?

విద్యా నేపథ్యం: అండర్ గ్రాడ్యుయేట్ (UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), మరియు పీహెచ్‌డీ (PhD) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఫుల్ టైమ్ లేదా పార్ట్ టైమ్ కోర్సు చేస్తున్నా పర్వాలేదు.

వయస్సు: జనవరి 1, 2026 నాటికి అభ్యర్థికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.

నైపుణ్యాలు: ఇంటర్నెట్, టెక్నాలజీ పాలసీపై ఆసక్తి ఉండాలి. మంచి రీసెర్చ్, రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి.

ముఖ్య గమనిక: అభ్యర్థులు యునైటెడ్ స్టేట్స్‌లో పనిచేయడానికి చట్టపరమైన అనుమతి (Work Authorization) కలిగి ఉండాలి. గూగుల్ వీసా ప్రాసెసింగ్‌లో ఎటువంటి సహాయం అందించదు.

2. స్టైఫండ్ వివరాలు:

ఈ ఫెలోషిప్‌కు ఎంపికైన వారికి హోస్ట్ సంస్థ నుండి ఆకర్షణీయమైన స్టైఫండ్ అందుతుంది:

ఫుల్ టైమ్ (వారానికి 40 గంటలు): సుమారు $12,000 (రూ. 10 లక్షలు).

పార్ట్ టైమ్ (వారానికి 20 గంటలు): సుమారు $6,000 (రూ. 5 లక్షలు).

3. ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 9, 2026 (మధ్యాహ్నం 12:00 గంటల వరకు).

చేరాల్సిన తేదీ: ఆగస్టు 30, 2026 నాటికి గుర్తింపు పొందిన విద్యా సంస్థలో అడ్మిషన్ కలిగి ఉండాలి.

4. ఎలా దరఖాస్తు చేయాలి?

ఆసక్తిగల అభ్యర్థులు గూగుల్ అధికారిక కెరీర్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. గతంలో ఈ ఫెలోషిప్‌లో పాల్గొన్న వారు తిరిగి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేదు.

Follow Us
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. ఈ రెండు పనులు వెంటనే చేయండి
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి సిద్ధమవుతున్న యశ్
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
కల్మా చదవాలని హిందూ విద్యార్థికి హోమ్‌ వర్క్‌..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..
పర్సులో దేవుళ్ల ఫోటోలు పెట్టుకుంటున్నారా? వాస్తు ప్రకారం ఇది..
గంభీర్ నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్‌ కెరీర్ క్లోజ్?
గంభీర్ నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్‌ కెరీర్ క్లోజ్?
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
పళ్ళు లేని ముసలివాళ్లు, చిన్న పిల్లలు ఇష్టంగా తినే సూపర్ రోటీలు
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
హైదరాబాద్‌లో జగన్నాథ రథయాత్ర.. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
SIR ఫారంలో వివరాలు తప్పుగా నింపారా..? మార్చుకోవడం ఈజీ
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
'ఊరు వాడ' కార్యక్రమం రాజకీయాల కోసమా ? ఫ్యాన్స్ ఏమన్నారు ?
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!
ఎంబాపేను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి అర్జెంటీనా స్టార్..!