National Education policy: ఇకపై స్కూళ్లలో గిల్లి దండ, కబడ్డీ గేమ్స్‌.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడి..

National Education policy 2020: దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020ని రూపొందించిన విషయం తెలిసిందే. 21వ శతాబ్దంలో...

National Education policy: ఇకపై స్కూళ్లలో గిల్లి దండ, కబడ్డీ గేమ్స్‌.. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడి..
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 01, 2022 | 2:58 PM

National Education policy 2020: దేశంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ 2020ని రూపొందించిన విషయం తెలిసిందే. 21వ శతాబ్దంలో భారతదేశాన్ని విశ్వ గురువుగా మార్చే దిశగా ఇది తొలి అడుగు కేంద్ర విద్యాశాఖ మంత్రి అప్పట్లో అభివర్ణించారు. ఇదిలా ఉంటే కేంద్ర తీసుకొచ్చిన ఈ కొత్త విద్యా విధానం జూలై 29తో రెండేళ్లు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగానే శుక్రవారం న్యూఢిల్లీలో కార్యక్రమంలోనే కేంద్ర హోంశాఖమంత్రి పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. విద్య, నైపుణ్యాభివృద్ధిలో భాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి స్కూళ్లలో క్రీడలను ప్రోత్సహించడం. 75 భారతీయ ఆటలను కర్య్కూలమ్‌లో జోడించారు. వీటిలో ప్రధానంగా గిల్లిదండా, కబడ్డీ, పోష్‌ పా, కంచె వంటి సంప్రదాయ క్రీడలు ఉన్నాయి.

ఇలాంటి ఆటలతో విద్యార్థులకు మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త విద్యా విధానంలో భాగంగా విద్యా అమృత్‌ పోర్టల్‌, 200 వర్చువల్‌ ల్యాబ్స్‌, పీఎమ్‌కేఐ కింద స్కిల్‌ హబ్స్‌, నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌ వర్క్‌, స్కూల్‌ ఇన్నోవేషన్‌ పాలసీ వంటి విధానాలను లాంచ్‌ చేశారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..