Viral: యూట్యూబ్‌ వీడియోలు చూసి ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకున్న యువకుడు.. చివరకు ఏమైందంటే?

Plastic Surgery : ఈరోజుల్లో చాలామంది అందంగా లేమనుకుంటూ తమలో తాము ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు. ముఖం బాగోలేదని, ముక్కు సరిగా లేదని అభద్రతా భావానికి గురువుతున్నారు.

Viral: యూట్యూబ్‌ వీడియోలు చూసి ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ చేసుకున్న యువకుడు.. చివరకు ఏమైందంటే?
Nose Surgery
Follow us
Basha Shek

|

Updated on: Aug 03, 2022 | 11:30 AM

Plastic Surgery : ఈరోజుల్లో చాలామంది అందంగా లేమనుకుంటూ తమలో తాము ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు. ముఖం బాగోలేదని, ముక్కు సరిగా లేదని అభద్రతా భావానికి గురువుతున్నారు.  అందుకే అందం కోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. మరికొందరు ప్లాస్టిక్‌ సర్జరీలంటూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇక ఎంతో అనుభవం, పనితనం ఉన్న నిపుణులే ఈ ప్లాస్టిక్‌ సర్జరీలే నిర్వహిస్తారు. అయితే ఏ కష్టమొచ్చిందో తెలియదు కానీ బ్రెజిల్ దేశానికి చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్(YouTube) చూసి తానే స్వయంగా ముక్కుకు ప్లాస్టిక్‌ సర్జరీ( Plastic Surgery) చేసుకున్నాడు. చివరకు ఆస్పత్రి పాలయ్యాడు.

తలంటు పోసిన డాక్టర్లు.. ఈ రోజుల్లో చాలామంది యూట్యూబ్‌ ట్యుటోరియల్స్‌ చూసి వంటలు, క్రాఫ్ట్‌ సహా అనేక విషయాలు నేర్చుకుంటున్నారు. అయితే వీటికి ఒక పరిమితి ఉంటుంది. ఈక్రమంలో బ్రెజిల్‌లోని సావోపాలోకు చెందిన ఒక వ్యక్తి యూట్యూబ్‌ వీడియోలను చూసి తన ముక్కుకు శస్త్రచికిత్స చేసుకున్నాడు. యూట్యూబ్ ట్యుటోరియల్ చూసిన తర్వాత ముక్కును సరిచేసుకోవడానికి రైనోప్లాస్టీ ఆపరేషన్‌ చేసుకున్నాడు. అయితే ఈ సర్జరీ తర్వాత పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో చేసేదేమి లేక ఆస్పత్రికి వెళ్లాడు. జరిగిన విషయాన్ని డాక్టర్లకు చెప్పాడు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు అతనికి బాగా తలంటుపోశారు. ఆ తర్వాత బాధితుడి గాయాన్ని శుభ్రం చేసి సరైన చికిత్స చేశారు. మరోసారి అలా ఎవరూ చేయవద్దని సూచించారు. ఇలాంటి విషయాల్లో సలహాలు, సూచనలు పాటించడం తప్పనిసరి అని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్