Sinkhole: మైనింగ్‌ సమీపంలో భారీ సింక్‌హోల్‌.. భూమిని మింగేస్తూ అంతకంతకూ పెరుగుతోంది..

ఉత్తరాన 413 మైళ్ల దూరంలో ఉన్న భూభాగంలో ఈ అసాధారణమైన సింక్‌హోల్ ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ ఆ ప్రాంతాన్ని సర్వే చేసేందుకు..

Sinkhole: మైనింగ్‌ సమీపంలో భారీ సింక్‌హోల్‌.. భూమిని మింగేస్తూ అంతకంతకూ పెరుగుతోంది..
Sinkhole
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Aug 03, 2022 | 1:42 PM

sinkhole: చిలీలో అనుమానాస్పదంగా కనిపించిన భారీ సింక్‌హోల్‌తో స్థానికులు ఉలిక్కిపడ్డారు. చిలీలోని ఓ మైనింగ్ ఏరియాలో ఈ భారీ సింక్‌ హోల్‌ని గుర్తించారు అధికారులు. అక్కడి సింక్‌హోల్ చుట్టుకొలత దాదాపు 25 మీట‌ర్ల వెడల్పు (82 అడుగులు)గా గుర్తించారు.. అలాగే, దాని లోతు దాదాపు 200 మీట‌ర్లు (656 అడుగులు) ఉంటుంద‌ని అధికారులు తెలిపారు. భూగర్భంలో జరిగే మార్పుల కారణంగా సింక్‌హోల్ ఏర్ప‌డుతుంది. భూమి కుంగిపోయిన‌ట్లు క‌న‌ప‌డుతుంది. భూగర్భజలాల తీవ్ర ఉద్ధృతి వేళ‌ భూమి ఉపరితలం కింద‌ కోత ఏర్పడి, ఆ ప్రాంతం పెళుసుబారి పెద్ద గోతిలా ఏర్ప‌డుతుంది. చిలీ రాజ‌ధాని శాంటియాగోకు ఉత్త‌రం వైపు 665 కిలోమీట‌ర్ల దూరంలోని కాపీయాపోలోని టీర్రా అమ‌రిల్లా న‌గ‌రంలో ఓ మైనింగ్ ప్రాంతం ఉంటుంది.

నివేదికల ప్రకారం.. కెనడియన్ మైనింగ్ సంస్థ అయిన లుండిన్ మైనింగ్ చేత నిర్వహించబడుతున్న రాజధాని శాంటియాగోకు ఉత్తరాన 413 మైళ్ల దూరంలో ఉన్న భూభాగంలో ఈ అసాధారణమైన సింక్‌హోల్ ఏర్పడింది. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన నేషనల్ సర్వీస్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ ఆ ప్రాంతాన్ని సర్వే చేసేందుకు నిపుణులను సైట్‌కు పంపారు. పైగా ఈ సింక్‌హోల్‌ నిరంతరం పెరుగుతోందని చెప్పారు. సింక్‌హోల్ ఇంకా పెరుగుతోందని అధికారులు ధృవీకరించిన తర్వాత దాని విస్తరణతో సమీపంలో నివసిస్తున్న చిలీ ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

వాస్తవం ఏమిటంటే మన చుట్టూ మైనింగ్ నిక్షేపాలు, భూగర్భ వర్క్స్‌ విస్తరంగా జరుగుతున్నాయి. అందువల్లే ఇక్కడ సింక్‌హోల్స్‌ ఏర్పడుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు.ఇది ఇంకా పెరుగుతోందన్నారు. ఇలాంటిది గతంలో చూడలేదని చెబుతున్నారు. గనుల తవ్వకాలకు సంబంధించిన కార్యకలాపాల వల్లే ఈ సింక్‌హోల్‌ సంభవించిందని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదన్నారు. కాకపోతే, ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు. అధికారులు నిరంతరం సింక్‌హోల్‌ని పర్యవేక్షిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
ఎరక్కపోయి ఇరుక్కున్నాడా..! ఈ కేసు నుంచి బన్నీ బయటపడే దారుందా..?
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..
మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్..