Spinach Benefits: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!

అధిక బరువుతో బాధపడేవారికి బచ్చలికూర చక్కటి డైట్. ఎందుకంటే బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవడం మంచిది. మరీ ముఖ్యంగా..

Spinach Benefits: బ‌చ్చ‌లికూర నిజంగా బంగార‌మే.. అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు..!
Spinach
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 03, 2022 | 12:34 PM

Spinach Benefits: మన‌కు అందుబాటులో ఉండే అనేక ర‌కాల ఆకుకూర‌ల్లో బ‌చ్చ‌లి కూర ఒక‌టి. కానీ, బ‌చ్చ‌లికూరను చాలామంది ఇష్టపడరు.. దాంతో ఎప్పటికప్పడు ఈ బచ్చలికూరను పక్కకు నెట్టేస్తుంటారు..అయితే, బచ్చలికూరలో దాగివున్న ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం నిజంగా బంగారమే అంటారు. బచ్చలి పోష‌కాల‌కు నిల‌యంగా చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. బచ్చలి బోలెడు ఔష‌ధ గుణాలు ఉంటాయి. బ‌చ్చ‌లికూర‌ను నేరుగా కూర‌,లేదా ప‌ప్పులా చేసుకు తిన‌వ‌చ్చు. బ‌చ్చ‌లికూర వ‌ల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి చాలా మంచిది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి బచ్చలి కూర దివ్య ఔషదంలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడతారని సూచిస్తున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర దివ్యౌషధంలా పనిచేస్తుంది. హైబీపీ పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో బచ్చలికూరను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బచ్చలి ఆకులను రసంగా కూడా చేసుకుని తాగుతుంటే..రక్తపోటు అదుపులో ఉంటుంది. అంతేకాదు.. బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బచ్చలికూరను తరచూ తీసుకోవటం ద్వారా శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ కరుగుతుంది. మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుతుంది. బచ్చలి కూరలో ఉండే కాల్షియం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. బచ్చలి కూరలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం అధికంగా ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి ఎంతో సహాయపడతాయి. అధిక బరువుతో బాధపడేవారికి బచ్చలికూర చక్కటి డైట్. ఎందుకంటే బరువు తగ్గాలనుకునే వారు తమ రోజు వారి ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవడం మంచిది

ఇవి కూడా చదవండి

మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో బాధపడేవారు రెగ్యులర్‌గా బచ్చలి కూరను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. బచ్చలి కూర వల్ల మూత్రం విసర్జనలో సమస్యలు తొలగిపోతాయి. పైల్స్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలతో బాధపడేవారు బచ్చలికూరను తింటే ఈ సమస్యను ఉపశమనం లభిస్తుందట. ఈ వేసవిలో బచ్చలి కూరను తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే బచ్చలికూర ఒంట్లో వేడిని తగ్గిస్తుంది.

(Note:- ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది.?
మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చింది.?
బంగారం ధర రూ.64 వేలకు పడిపోనుందా..? ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
బంగారం ధర రూ.64 వేలకు పడిపోనుందా..? ధరలు ఎప్పుడు తగ్గుతాయి?
పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెర్త్‌లో ముంబై వాలా దూకుడు.. సిక్స్‌ల రికార్డులో టాప్ లేపాడుగా
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
పెళ్ళికాని వారికి వివాహం జరిపించే వినాయకుడు.. ఈ ఆలయం ఎక్కడ ఉందంటే
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
సైలెంట్‌గా బిగ్ బాస్ ఫేమ్ సోనియా ఎంగేజ్‌మెంట్.. వరుడు ఎవరంటే?
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
వామ్మో.. ఆహారాన్ని తొందర తొందరగా తింటున్నారా.. డేంజర్‌లో పడినట్టే
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
BSNL కీలక నిర్ణయం.. ఆ 48 ప్రదేశాల్లో ఉచిత వైఫై.. టవర్ల ఏర్పాటు!
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
రెడ్‌మీ కొత్త సిరీస్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి.
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
యాత్రికుల బస్సు బోల్తా.. తొమ్మిది మందికి గాయాలు
Flipkart: ఐఫోన్‌తో సహా ఈ ప్రోడక్ట్‌లపై 80 శాతం తగ్గింపు..!
Flipkart: ఐఫోన్‌తో సహా ఈ ప్రోడక్ట్‌లపై 80 శాతం తగ్గింపు..!