Kidney Health: వీటిని అతిగా తింటున్నారా..? జర జాగ్రత్త.. ఆరోగ్యంపై ఎటాక్ ఎక్కువుండొచ్చు
Kidney Health: ప్రొటీన్ కు కేరాఫ్ అడ్రస్ పప్పు ధాన్యాలు. నాన్ వెజ్ తినని వారికి ఇవి మంచి ఆలర్నేటివ్ ఫుడ్. మన దేశంలో వీటి వినియోగం అధికంగానే ఉంటుంది. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పప్పుల్లో (Lentils) ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను అదుపులో ఉంచి, శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పప్పు […]
Kidney Health: ప్రొటీన్ కు కేరాఫ్ అడ్రస్ పప్పు ధాన్యాలు. నాన్ వెజ్ తినని వారికి ఇవి మంచి ఆలర్నేటివ్ ఫుడ్. మన దేశంలో వీటి వినియోగం అధికంగానే ఉంటుంది. వీటిలో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. పప్పుల్లో (Lentils) ఎక్కువ మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్ డ్యామేజ్ నుంచి కాపాడతాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను అదుపులో ఉంచి, శరీరంలో కొవ్వు స్థాయులు తగ్గిస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పప్పు ధాన్యాలను తినడం వల్ల మధుమేహం ముప్పు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇన్ని అద్భుత ప్రయోజనాలు ఉన్న పప్పులను అధికంగా వాడితే ఆరోగ్య (Health Problems) సమస్యలు వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు.
పప్పు ఎక్కువగా తింటే కిడ్నీలపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపుతుంది. కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఓ నివేదికలో వెల్లడైంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు అవకాశం ఉన్న పదార్థాలు పప్పుల్లో ఉన్నాయని అధ్యయనంలో వెల్లడైంది. పప్పులో ఫైబర్ అధికంగా ఉంటుంది. దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు వస్తాయి. అది ఎసిడిటీకి దారి తీస్తుంది.
పప్పుధాన్యాల్లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే వేగంగా బరువు పెరుగుతారు. అదనపు ప్రోటీన్ శరీరంలో కొవ్వుగా స్టోర్ అవుతుంది. కీళ్లనొప్పులతో బాధపడేవారు పప్పు తినే విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిందే. పప్పుధాన్యాల్లో లెక్టిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను తగ్గిస్తుంది. ‘వీటిలో ఉండే ప్యూరిన్ విచ్ఛిన్నం చెందినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇది ఎప్పటికప్పుడు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది. అయితే విసర్జన సరిగా జరగకపోయినప్పుడు యూరిక్ యాసిడ్ రక్తంలోనే ఉండిపోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్లు వాపు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు వైద్యులు, నిపుణులను సంప్రదించడం ఉత్తమం.