Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రణ చిట్కాలు.. ఇలా చేస్తే కేవలం 4 రోజుల్లోనే మధుమేహానికి చెక్‌..!

Diabetes: ఈ రోజుల్లో మధుమేహం సర్వసాధారణమైపోయింది. కానీ, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంకా మార్కెట్‌లో సరైన మందులు అందుబాటులోకి రాలేవు. అయితే చాలా మంది నిపుణులు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు తమ ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌లో మీకు సరైన ఆహారం లేకపోతే, మీ సమస్య మరింత పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అనేక […]

Diabetes Control Tips: డయాబెటిస్ నియంత్రణ చిట్కాలు.. ఇలా చేస్తే కేవలం 4 రోజుల్లోనే మధుమేహానికి చెక్‌..!
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 03, 2022 | 8:10 AM

Diabetes: ఈ రోజుల్లో మధుమేహం సర్వసాధారణమైపోయింది. కానీ, ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇంకా మార్కెట్‌లో సరైన మందులు అందుబాటులోకి రాలేవు. అయితే చాలా మంది నిపుణులు ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి పలు రకాల సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు తమ ఆహారంపై శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌లో మీకు సరైన ఆహారం లేకపోతే, మీ సమస్య మరింత పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ రోగులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అనేక మార్గాలను ఎంచుకుంటారు. అయితే, మధుమేహాన్ని నియంత్రించడానికి ఇలాంటి కొన్ని ఆహార నియమాలు పాటిస్తే..కేవలం వారం రోజుల వ్యవధిలోనే మంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మధుమేహం సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా కొన్ని రకాల ఆహార పదార్థాలను తమ డైట్‌ మెనులో ఉండేలా చూసుకోవాలి..అందులో ముఖ్యంగా ఉడికించిన కోడిగుడ్డు, తృణధాన్యాలు,మిల్లెట్ దోస,బ్లాక్ గ్రామ్స్‌,కలబంద జ్యూస్ వంటివి క్రమంగా తప్పకుండా తీసుకోవాలి. ఉడికించిన గుడ్డు శరీరానికి అవసరమైన చాలా రకాల ప్రోటిన్లను అందిస్తుంది. ఇక రోజూ అన్నం తినడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం పెరుగుతుంది. అన్నానికి బదులుగా రాగి పిండితో చేసిన దోసలను ఆహారంగా తీసుకుంటే రక్తంలో చక్కెర పరిమాణం తగ్గుతుంది. ఇంకా పలు రకాల అనారోగ్య సమస్యలు సైతం దూరమవుతాయి.అలాగే, తృణధాన్యాలతో తయారు చేసిన వంటకాలు కూడా మధుమేహం వ్యాధిగ్రస్తులుకు మేలు చేస్తాయి. తృణధన్యాల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు శరీరానికి కావాల్సినన్ని దొరుకుతాయి. డయాబెటిక్ రోగులకు ఇది ఆరోగ్యకరమైన ఆహారంగా చెబుతున్నారు వైద్య నిపుణులు.

అలాగే, బ్లాక్ గ్రామ్స్‌ కూడా షుగర్‌ బాధితులకు ఆరోగ్యానిస్తాయంటున్నారు. బ్లాక్‌ గ్రామ్స్‌లో శరీరానికి కావాల్సిన అన్ని రకాల ప్రోటిన్లు ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆహారంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇక, కలబంద కూడా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఔషధంగా చెబుతున్నారు. అలోవెరాను క్రమం తప్పకుండా ఈ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణం నియంత్రణలో ఉంటుంది. అలోవెరా జెల్‌లో వేయించిన జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, పుదీనా ఆకులను ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగితే మంచిదని డయాబెటీస్‌ నిపుణులు సూచిస్తున్నారు.