AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2: ‘ధురంధర్ 2’ బడ్జెట్ ఎంత? ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు? సారా అర్జున్ కు అన్ని కోట్లా?

'ధురందర్ 2' సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ క్రేజీ సీక్వెల్ లో రణవీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సారా అర్జున్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి వారు ఎంతెంత పారితోషికం తీసుకున్నారో తెలుసుకుందాం రండి.

Dhurandhar 2: 'ధురంధర్ 2' బడ్జెట్ ఎంత? ఎవరికెంత రెమ్యునరేషన్ ఇచ్చారు? సారా అర్జున్ కు అన్ని కోట్లా?
Dhurandhar 2 Movie
Basha Shek
|

Updated on: Mar 17, 2026 | 5:25 PM

Share

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్ వీర్ సింగ్ హీరోగా ‘ధురందర్ 2’ చిత్రం రిలీజ్ కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది. దానికి ఒక రోజు ముందు, అంటే మార్చి 18న, ‘ధురందర్ 2’ పెయిడ్ ప్రివ్యూలు పడనున్నాయి. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ‘ధురందర్ 2’ కోసం అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. వీటి ద్వారా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయని సమాచారం. రూ. 275 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ మల్టీ-స్టారర్ చిత్రంలో రణవీర్ సింగ్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ తదితర స్టార్స్ నటించారు. మరి వీరు ఎంతెంత పారితోషికం తీసుకున్నారో తెలుసుకుందాం రండి.

కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. ‘ధురందర్ 2’ కోసం రణ్‌వీర్ సింగ్ యాభై కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నాడట.. ఈ చిత్రంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడు అతనే. ఈ చిత్రంలో రణ్‌వీర్ హంజా, జస్కిరత్ సింగ్ రంగీ అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. ఇక చౌదరి అస్లాం పాత్ర పోషిస్తున్న సంజయ్ దత్ పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. అర్జున్ రాంపాల్ ఈ మూవీలో చాలా క్రూరమైన విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఇందుకోసం ఆయన 3 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నారట. ఇక సారా అర్జున్ అయితే కోటి రూపాయల పారితోషకం తీసుకుందట. ఇందులో ఆమె హంజా భార్య యాలినా జమాలి పాత్ర పోషించింది. దీనికి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రంలో నటుడు ఆర్. మాధవన్ అజయ్ సన్యాల్ పాత్రను పోషించారు. దీని కోసం ఆయన రూ. 9 కోట్ల పారితోషికం తీసుకున్నారు. ‘ధురందర్’ చిత్రంలో అక్షయ్ ఖన్నా పాత్ర బాగా హైలెట్ గా నిలిచింది. మొదటి భాగంలో అక్షయ్ రెహమాన్ డకైట్ పాత్ర చనిపోతుంది. కానీ ఇప్పుడు రెండవ భాగంలో ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ లో అక్షయ్ కనిపించనున్నాడు. దీని కోసం ఆయన రూ. 2 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు తెలిసింది. ఇక ‘ధురందర్’ మొదటి భాగం 2025 డిసెంబర్‌లో విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ. 1300 కోట్లకు పైగా వసూలు చేసింది.

ధురంధర్ 2 సినిమా తెలుగు ట్రైలర్ ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us