AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పెరుగు వీరికి విషంతో సమానం.. తినేముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

పెరుగు అంటే ఇష్టపడనవి వారు ఎవరు ఉంటారు. ఎన్ని కూరగాయలు ఉన్నా.. చివరకు పెరుగుతో తింటేనే భోజనం సంపూర్ణం అవుతుంది. పెరుగు కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఒక అద్భుతమైన 'సూపర్‌ఫుడ్' ఇందులో ప్రోటీన్లు, మంచి కొవ్వులు అనేకమైన పోషకాలు ఉంటాయి. కానీ ఇది అందిరికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు. పెరుగు తింటే మరిన్న సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందని సూచిస్తున్నారు. కాబట్టి పెరుగు ఎవరు తినాలి, ఎవరు తినకూడదో తెలుసుకుందాం.

Health Tips: పెరుగు వీరికి విషంతో సమానం.. తినేముందు ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
Yogurt Health Benefits
Anand T
|

Updated on: Mar 17, 2026 | 5:29 PM

Share

మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా జనాలు అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో అధిక రక్తపోటు కూడా ఒకటి. ‘నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్’ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, వారానికి 5 సార్లు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదాన్ని 20% వరకు తగ్గించవచ్చని తేలింది. దీనికి కారణం, పెరుగులోని పొటాషియం శరీరం నుండి అదనపు సోడియంను తొలగించడంలో సహాయపడటమే. అయితే, పెరుగు అందరికీ మంచిదేనా? అంటే కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పెరుగు తింటే అవి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

పెరుగువల్ల కలిగే ప్రయోజనాలు

రక్తపోటు నియంత్రణ: పెరుగులోని పొటాషియం, మెగ్నీషియం శరీరం నుండి అదనపు సోడియంను బయటకు పంపడానికి, రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడతాయి, దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.

పేగు ఆరోగ్యం కోసం: పెరుగులోని ప్రోబయోటిక్స్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. ఇవి గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం, ఐ.బి.ఎస్ (IBS) వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. ఇది ‘సెరోటోనిన్’ను కూడా పెంచి, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.

రోగనిరోధక శక్తి: పెరుగులో జింక్, సెలీనియం, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల అది శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. ఇది శరీరంలో వాపును తగ్గించి, దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.

ఎముకలు, దంతాలను బలపరుస్తుంది: పెరుగులో కాల్షియం అధికంగా ఉండటం వల్ల, ఇది ఎముకలను బలపరుస్తుంది. చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు, ఎముకల ఆరోగ్యానికి పెరుగు మంచిది.

 చర్మం, జుట్టు సంరక్షణ: పెరుగులోని లాక్టిక్ యాసిడ్ సహజమైన మాయిశ్చరైజర్‌గా పనిచేసి, చర్మపు రంగును మెరుగుపరుస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లను బలపరిచి, వాటిని మెరిసేలా చేస్తుంది.

పెరుగు ఎవరు తినకూడదు

  • పెరుగు ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, ఈ క్రింది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే దీనిని తీసుకోవాలి.
  • కీళ్ల నొప్పులు: పెరుగు తినడం వల్ల కొంతమందిలో ఈ నొప్పులు మరింత పెరగవచ్చు. కాబట్టి తినే ముందు వైద్యుడిని సంప్రదించండి
  • ఆస్తమా అండ్ శ్వాసకోశ: ఈ సమస్యలు ఉన్నవారు కూడా పెరుగుకు దూరంగా ఉండండి. ఎందుకంటే ఇది తినడం వల్ల కఫం పేరుకుపోయి సమస్య రావచ్చు.
  • కిడ్నీ సమస్యలు: కిడ్నీ వ్యాధి ఉన్నవారు కూడా పెరుగుతో జాగ్రత్తగా ఉండాలి.
  • తీవ్రమైన ఎసిడిటీ: ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల గ్యాస్ పెరగవచ్చు. కాబట్టి గ్యాస్ సమస్యలు ఉన్నవారు పెరుగుకు దూరంగా ఉండండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us