ఇడ్లీ, దోసె వద్దు.. బ్రేక్‌ఫాస్ట్‌కు ఇదే పర్ఫెక్ట్ అంటున్న నిపుణలు
Prasanna Yadla
17 March 2026
Pic credit - Pixabay
ఉదయం ఇడ్లీ, దోసె వద్దు.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది చాలా మంచిదని చెబుతున్నారు.
బ్రేక్‌ఫాస్ట్
దోసెలలో పెసరట్టు చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఇది తినడానికి రుచిగా ఉంటుంది.
పెసరట్టు
ఇది పెసలతోనే తయారు చేస్తారు. ఇది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
పెసరట్టు
మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఎలా తయారు చేయాలంటే
ఒక కప్పు పెసర్లు , అర కప్పు బియ్యపు పిండి, ఒక టేబుల్ స్పూన్ అల్లం, 4 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ జీలకర్ర,
రుచికి సరిపడా ఉప్పు, ఒక ఉల్లిపాయ, రెండు స్పూన్స్ నూనె.
కావాల్సిన పదార్ధాలు
ముందుగా పెసర్లు, బియ్యాన్ని బాగా కడిగి శుభ్రం చేసి నానాబెట్టి ఉదయానికి మిక్సీలో నానాబెట్టుకోవాలి.
స్టెప్ - 1
ఇక ఇప్పుడు గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టి అది వేడయ్యాక పిండిని కలిపి దోస లాగా వేసుకోవాలి.
స్టెప్ - 2
దోస రెండు వైపులా కాల్చుకోవాలి. ఇలా చేస్తే ఇది కరకరలాడుతుంది. అల్లం చట్నీతో తింటే టేస్టీగా ఉంటుంది.