AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో వడ గళ్ల వానలు ఎందుకు వస్తాయో తెలుసా?

సమ్మర్ వచ్చేసింది. ఇక ఎండాకాలం అంటే వివపరీతమైన ఉక్కపోత, వేడి, భానుడి భగ భగలు మాత్రమే కాదండోయ్.. ఎండాకాలం వచ్చిందంటే చాలు తప్పకుండా వడ గళ్ల వానలు కురుస్తాయి. మరి మీరు ఎప్పుడైనా గమనించారా? మండే ఎండాకాలంలో మాత్రమే వడ గళ్ల వానలు కురుస్తాయి.

Samatha J
|

Updated on: Mar 17, 2026 | 5:12 PM

Share
ఎండాకాలం అంటే వివపరీతమైన ఉక్కపోత, వేడి, మాత్రమే కాదండోయ్.. ఎండాకాలం వచ్చిందంటే చాలు తప్పకుండా వడ గళ్ల వానలు కురుస్తాయి. మరి మీరు ఎప్పుడైనా గమనించారా? మండే ఎండాకాలంలో మాత్రమే వడ గళ్ల వానలు కురుస్తాయి. ముఖ్యంగా ఎండాకాలం తీవ్ర స్థాయిలో ఉన్నసమయంలో, ఉష్ణోగ్రత పెరిగే సమయంలో ఇలాంటి వానలు పడటం జరుగుతుంది. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఎండాకాలంలోనే ఈ వడ గళ్ల వానలు ఎందుకు కురుస్తాయో, ఇప్పుడు మనం దాని గురించే వివరంగా తెలుసుకుందాం.

1 / 5
ఎండాకాలం ప్రారంభమైంది. మార్చి నెలలో ఎండల తీవ్రత పెరిగిపోయింది. అయితే ఈ సమయంలో చాలా మంది ఒక వర్షం పడితే బాగుండు అనుకుంటారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఎండాకాలంలో చాలా వరకు వడ గళ్ల వర్షం పడుతుంది. మరి ఎందుకు ఇలా పడుతుంది? దీని గురించి నిపుణులు ఏమంటున్నారంటే?

2 / 5
వడ గళ్ల వర్షం ఎక్కువగా వేసవిలోనే పడుతుందంట. దీనికి కారణం ఉష్ణోగ్రత. వడ గళ్లు ఏర్పడాలి అంటే నేలపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండాలి. అయితే సాధారణ సమయంలో కంటే వేసవిలోనే ఉష్ణోగ్రత, వేడి ఎక్కువగా ఉంటుంది.  మార్చి నెల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి కాబట్టి, వడగళ్ల వర్షం పడటానికి ఇదే అనుకూల సమయం. దాదాపు జూన్ చివరి వరకు ఈ వడగళ్ల వర్షం పడే ఛాన్స్ ఉంటుందంట. ఇది ఉష్ణోగ్రతను బట్టి.

3 / 5
వేసవిలో భూమిపై వేడి ఎక్కువగా ఉంటుంది. సముద్రం చల్లగా ఉంటుంది. దీంతో వడగళ్లను ఇచ్చే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అవి చాలా ఎత్తులోకి చేరుకొని, వాడ గళ్ల వానలను ఇస్తాయి. ఈ క్యుములోనింబస్ మేఘాలు పైకి చేరి ఒకదానికి ఒకటి ఢీ కొంటాయి.

4 / 5
అప్పుడు మేఘాలు విరిగిపోయి ముక్కలు ముక్కలుగా భూమిని చేరుతాయి. అయితే వాతావరణంలో వేడి వలన అవి కాస్త కరిగి కింద పడిపోతాయి. ఇక వేసవిలో మాత్రమే క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడతాయి కాబట్టి, వేసవిలో మాత్రమే ఈ వడగళ్ల వర్షాలు పడతాయని చెబుతున్నారు నిపుణులు. ( నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని దృవీకరించలేదు.)

5 / 5
Follow Us