వరంగల్లో కేయూ పీజీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. సీనియర్లు దొంగతనం నెపం మోపడంతో మనస్తాపానికి గురై ప్రాణాలు తీసుకున్నట్లు ఆరోపణ. మార్చి 7న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన శ్రీవిద్య, చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా ఆరుగురు విద్యార్థినులపై కేయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.