అందమైన ముఖాలు, తీయటి గొంతులతో ఆకర్షించే యాడ్స్‌తో సైబర్ నేరగాళ్లు హనీట్రాప్ వల విసురుతున్నారు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే వ్యక్తిగత సమాచారం చోరీ చేసి, మార్ఫింగ్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బాధితులు వెంటనే 1930 లేదా cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలని సూచించారు.