Sister Library: మహిళల కోసమే పురుడుపోసుకున్న సరికొత్త లైబ్రరీ.. లోపలికి అడుగుపెట్టగానే..

ఐదు సంవత్సరాల క్రితం100 పుస్తకాలతో ప్రారంభమైనా ఈ సిస్టర్స్‌ లైబ్రరీలో పుస్తకాల సంఖ్య ఇప్పుడు వెయ్యి దాటింది.

Sister Library: మహిళల కోసమే పురుడుపోసుకున్న సరికొత్త లైబ్రరీ.. లోపలికి అడుగుపెట్టగానే..
Sister Library
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 03, 2022 | 10:14 AM

Sister Library: ఆడవాళ్లకు మాత్రమే ఇలాంటి సూచిక బోర్డులు నిత్యం అనేకం చూస్తుంటాం..కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయేది మాత్రం వెరీ స్పెషల్‌..ఇదేదో, ఆడవాళ్ల షాపింగ్‌, ఉద్యోగం, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించినది కాదు.. ఆడవాళ్లను చైతన్య వంతులుగా తీర్చిదిద్దే సరికొత్త ప్రయత్నం. మురికివాడలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన ముంబై ధారావిలో పురుడుపోసుకుంది ‘సిస్టర్‌ లైబ్రరీ’. మహిళల కోసమే ఏర్పాటు చేసిన ఈ గ్రంథాలయాన్ని ఆర్టిస్ట్‌ అక్వీ థామీ ప్రారంభించారు. ఇది దేశంలోనే మొట్టమొదటి స్త్రీవాద గ్రంథాలయం. ఈ లైబ్రరీ లోపలికి అడుగుపెట్టగానే ఆలోచన రేకెత్తించే పుస్తకాలు దర్శన మిస్తాయి. అవన్నీ రాసిన వారు కూడా మహిళలే కావడం మరో ప్రత్యేకత.

మహిళల కోసమే అక్వి థామీ అనే మహిళ ఓ లైబ్రరీని ఏర్పాటు చేశారు. కేవలం ఆడవాళ్ల రచనలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డార్జిలింగ్‌కి చెందిన 31 ఏళ్ల అక్వి థామీ చిత్రకారిణి. ముంబయిలో స్థిరపడ్డారు. ముంబయికి వచ్చిన కొత్తలో తాను ఎదుర్కొన్న వ్యతిరేకత, జాత్యహంకారాలను ఎదుర్కొవాల్సి వచ్చింది. వాటి ప్రభావం ఆమెపై బాగా పడింది. దీనిలో మార్పు తేవడానికి కళ ఒక్కటే మార్గమని భావించిన అక్వి..‘ధారావి ఆర్ట్‌ రూమ్‌’ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా మురికివాడల పిల్లలు ఉచితంగా చదువుకోడంతోపాటు నచ్చిన ఆర్ట్‌ను నేర్చుకునే వీలు కల్పించింది. ఐదు సంవత్సరాల క్రితం100 పుస్తకాలతో ప్రారంభమైనా ఈ సిస్టర్స్‌ లైబ్రరీలో పుస్తకాల సంఖ్య ఇప్పుడు వెయ్యి దాటింది. నేపాల్‌, బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌, అమెరికా దేశాల సాహిత్యానికీ సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో లభిస్తాయి. ఈ క్రమంలోనే ‘రేడియో సిస్టర్‌’ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు థామీ. ‘సిస్టర్‌ ప్రెస్‌’ ద్వారా ఇక్కడ ముద్రణలో మహిళలకు శిక్షణ ఇస్తున్నారు. ‘సిస్టర్‌ టైమ్స్‌’ మాసపత్రికను స్థానిక మహిళలే ముద్రిస్తారు.

అంతేకాదు..కోవిడ్-19 మహమ్మారి లాక్‌డౌన్ దెబ్బకు లైబ్రరీని కొన్ని నెలల పాటు మూసివేశారు. అయితే థామీ సబ్‌స్క్రైబర్‌లు, అభిమానులను ఇంటరాక్ట్ చేయడానికి ఆన్‌లైన్‌లో నిర్వహించింది. ఇప్పుడు లైబ్రరీ తిరిగి తెరవబడింది. ఇ-బుక్ రీడింగ్‌లు, చిత్ర ప్రదర్శనలు క్రమంగా జరుగుతున్నాయి. వారి ఇన్‌స్టాగ్రామ్ డీల్‌లో నోటిఫికేషన్‌లు కూడా పంపుతుంటారు. లైబ్రరీ మహిళా మండలి (మహిళల సర్కిల్), మాన్‌సూన్ స్కూల్‌ను నిర్వహిస్తుంది. ఇది బాలికలకు ఆవిష్కరణ పద్ధతులను నేర్చుకునేందుకు వీలుగా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి