Hair Loss: వేధించే బట్టతలకు మిరాకిల్ టిప్స్.. ఓ సారి ట్రై చేసి చూడండి..!
ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో చిన్న వయస్సులోనే బట్టతల రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి..
Hair Loss: నేటి జీవన విధానంలో యువత కూడా ఎక్కువగా జుట్టు రాలిపోయే సమస్యను ఎదుర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే బట్టతల రావడం చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా జుట్టు రాలడం అనేది స్త్రీల సమస్య అని మనందరం అనుకుంటాం. కానీ పురుషులకు కూడా ఇది పెద్ద సమస్య. మానసిక ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్లు, గంటల కొద్ది స్మార్ట్ఫోన్ల వినియోగం వంటివి బట్టతల కారణం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలిలో చిన్న వయస్సులోనే బట్టతల రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి పురుషులు వివిధ ఆహారాలు,చికిత్సలను ఆశ్రయిస్తారు. అయితే ఆ తర్వాత కూడా కొందరికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే, ఒత్తిడి తీసుకోవద్దు. కొన్ని హోం రెమెడీస్‌ని అనుసరించడం ద్వారా జుట్టు రాలడం సమస్య నుండి బయటపడవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పిప్పరమింట్ ఆయిల్
పుదీనాతో చేసిన పిప్పరమింట్ ఆయిల్ జుట్టుకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది. పిప్పరమెంటు నూనెలో విటమిన్ ఎ, సి, కాల్షియం, ఖనిజాలు, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. పెప్పర్ మింట్ ఆయిల్ ను తలకు పట్టించడం వల్ల రక్త ప్రసరణ పెరిగి జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా, పురుషులు కొబ్బరి నూనె,ఆలివ్ నూనెను కూడా ఉపయోగించవచ్చు.
ఉల్లిపాయ రసం
జుట్టు పెరుగుదలకు అత్యంత ప్రభావవంతమైన హోం రెమెడీలలో ఉల్లిపాయ రసం ఒకటని అందరికీ తెలిసిందే. ఉల్లిపాయ రసాన్ని జుట్టు మూలాలకు పట్టించడం వల్ల ఫోలికల్స్ బలపడతాయి. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది. అంతే కాకుండా ఉల్లిపాయ రసం కూడా కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. రెగ్యులర్ గా వాడితే బట్టతల మాయమవుతుంది.
ఒత్తిడిని తగ్గించుకోండి
మగవారి బట్టతలకి ఒత్తిడి కూడా ఒక కారణం కావచ్చు. మీ జుట్టు రాలిపోతుంటే, మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలి. టెన్షన్, ఆందోళన నుండి బయటపడండి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి రోజూ వ్యాయామం చేయండి. దీనితో పాటు, మంచి నిద్ర కూడా ఒత్తిడిని తగ్గించడానికి గొప్ప మార్గం. పైన పేర్కొన్నవన్నీ అనుసరించడంతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం అవసరం.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి