- Telugu News Photo Gallery Cinema photos In the occasion of world breast feeding week these indian actress shared their breast feeding photos in social media Telugu Lifestyle News
World Breastfeeding Week : ఆ ఫొటోలతో అమ్మపాల విశిష్టతను చాటిచెప్పారు.. వీళ్ల సామాజిక స్పృహకు సెల్యూట్ చెప్పాల్సిందే
World Breastfeeding Week :తల్లిపాల విశిష్టత, ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు గాను ఏటా ఆగస్టు మొదటివారం (1-7) బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ (తల్లిపాల వారోత్సవాలు) నిర్వహిస్తారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు.
Updated on: Aug 02, 2022 | 2:09 PM

తల్లిపాల విశిష్టత, ప్రయోజనాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు గాను ఏటా ఆగస్టు మొదటివారం (1-7) బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ (తల్లిపాల వారోత్సవాలు) నిర్వహిస్తారు. ఇందులో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భాగమవుతున్నారు. తమ పిల్లలకు పాలిచ్చే ఫొటోలను ధైర్యంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అమ్మపాల విశిష్టతను చాటి చెబుతున్నారు.

మహిళల సమస్యలపై స్వేచ్ఛగా గళమెత్తే నటీమణుల్లో బాలీవుడ్ నటి నేహా ధూపియా కూడా ఒకరు. ఈక్రమంలో బ్రెస్ట్ ఫీడింగ్ ప్రయోజనాలను వివరిస్తూ తన బిడ్డకు పాలిస్తున్న ఫొటోను నెట్టింట్లో షేర్ చేసింది. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నిర్వహించే పలు అవగాహనా కార్యక్రమాల్లోనూ భాగమవుతోంది.

బాలీవుడ్ నటి లీసా హేడన్ కూడా ఈ జాబితాలో ఉంది. గతంలో తన బిడ్డకు తల్లిపాలు ఇస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో పాటు నెలసరి, తదితర మహిళల సమస్యలపై తరచూ సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోందీ ముద్దుగుమ్మ.

మహాభారతం వంటి షోలలో భాగమైన నటి శిఖా సింగ్ కూడా తన బిడ్డకు తల్లిపాలు ఇస్తున్న చిత్రాన్ని పంచుకుంది. ఈ ఫొటోపై ఆమె అభిమానులు ప్రశంసలు కూడా కురిపించారు.

జర్మన్ నటి, సాహో ఫేం ఎవెలిన్ శర్మ కూడా తాజాగా ఒక అందమైన ఫొటోను షేర్ చేసుకుంది. ఇందులో ఆమె తన బిడ్డకు తల్లిపాలు ఇస్తూ కనిపించింది. ఈ ఫోటో నెట్టింట్లో బాగా వైరలైంది. ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపించారు.




