AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: మంకీపాక్స్ డేంజర్‌ బెల్స్‌.. దేశంలో ఏడుకు చేరిన పాజిటివ్‌ కేసులు..

మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా లైంగిక సంబంధాలుండటం వల్ల కూడా ఎక్కువగా వ్యాపిస్తుందని అన్నారు. ఈ వ్యాధి సోకిన వారి నోటి నుంచి..

Monkeypox: మంకీపాక్స్ డేంజర్‌ బెల్స్‌.. దేశంలో ఏడుకు చేరిన పాజిటివ్‌ కేసులు..
Monkey Pox
Jyothi Gadda
|

Updated on: Aug 02, 2022 | 1:52 PM

Share

Monkeypox: కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదయింది. యూఏఈ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి మంకీపాక్స్ గా వైద్యులు ధృవీకరించారు. యూఏఈ నుంచి గత నెల 27న కోజికోడ్‌ విమానాశ్రయంలో దిగిన 30 ఏళ్ల యువకుడిని వచ్చాడు. కోజికోడ్ విమానాశ్రయంలో అతనికి జరిపిన వైద్య పరీక్షల్లో మంకీ పాక్స్ గా తేలడంతో అతనిని ప్రస్తుతం మలప్పురంలోని మంజేరి మెడికల్‌ కాలేజీలో ప్రత్యేక విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ తెలిపారు. . అతని శరీరంపై దుద్దుర్లు రావడం, జ్వరం కూడా ఎక్కువగా రావడంతో అతని రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. అందులో మంకీపాక్స్ అని నిర్ధారణ అయింది. దీంతో దేశంలో మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుకు చేరింది. ఇందులో కేరళ నుండి ఐదు కేసులు నమోదు కాగా, ఢిల్లీ నుండి రెండు మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయి.

దేశంలో తొలి మంకీపాక్స్ కేసు కేరళలోనే నమోదయింది. ఆ తర్వాత నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ కేరళలో ఐదు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. తొలిసారి మంకీపాక్స్ సోకిన వ్యక్తికి కేరళ వైద్యులు చికిత్స అందించారు. ఆయన కోలుకున్నారు. అతనికి నెగిటివ్ వచ్చింది. దీంతో కొంత ధైర్యం వచ్చిన వైద్య శాఖ మంకీపాక్స్ సోకిన వారి కోసం ప్రత్యేక వార్డులను ప్రారంభించింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, మంకీపాక్స్‌ వైరస్‌ ప్రధానంగా లైంగిక సంబంధాల ద్వారా కూడా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధినేత టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు. మంకీపాక్స్ సోకిన పురుషులతో సన్నిహిత శరీరక సంబంధాలకు దూరంగా ఉండటం మంచిదన్నారు. పురుషులలో మంకీపాక్స్‌ లక్షణాలు కనిపించినా.. లైంగికపరంగా దూరంగా ఉండటం మంచిదని సూచించారు. దీనిపై అంతర్జాతీయ పరిశోధనలు జరుగుతున్నాయి. మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా లైంగిక సంబంధాలుండటం వల్ల కూడా ఎక్కువగా వ్యాపిస్తుందని అన్నారు. ఈ వ్యాధి సోకిన వారి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా కూడా వ్యాపిస్తుందని చెబుతున్నారు. పురుషులతో సన్నిహితంగా ఉండేవారు కాస్త జాగ్రత్తలు వహించడం ఎంతో ముఖ్యమంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
చాణక్యుని 4 సూత్రాలతో మీ రోజును మొదలుపెడితే జీవితంలో విజయం ఖాయం
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
మండే ఎండల్లో మిమ్మల్ని చలచల్లగా ఉంచే సూపర్ డ్రింక్స్.. తాగేద్దామా
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే
వాస్తు టిప్స్: తడి బట్టలు ఇంట్లో ఆరేస్తున్నారా..అదృష్టం పోయినట్లే