National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కీలక మలుపు.. ఢిల్లీలో వరుసగా ఈడీ సోదాలు

Enforcement Directorate Raids: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఢిల్లీలోని నేషనల్‌ హెరాల్డ్‌ ప్రధాన కార్యాలయంతో పాటు పలు కార్యాలయాల్లో వరుస సోదాలు నిర్వహిస్తోంది.

National Herald case: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కీలక మలుపు.. ఢిల్లీలో వరుసగా ఈడీ సోదాలు
Enforcement Directorate
Follow us
Basha Shek

|

Updated on: Aug 02, 2022 | 1:31 PM

Enforcement Directorate Raids: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ కేసులో దూకుడు పెంచిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఢిల్లీలోని నేషనల్‌ హెరాల్డ్‌ ప్రధాన కార్యాలయంతో పాటు పలు కార్యాలయాల్లో వరుస సోదాలు నిర్వహిస్తోంది.  నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక ప్రధాన కార్యాలయంతో పాటు డజను చోట్ల ఈడీ దాడులు చేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA)లోని క్రిమినల్ సెక్షన్ల కింద ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.   మనీలాండరింగ్ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరించేందుకే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా సెంట్రల్ ఢిల్లీలోని ఐటీఓ బహదూర్ షా జాఫర్ మార్గ్‌లో ఉన్న ‘హెరాల్డ్ హౌస్’ కార్యాలయంలో కూడా దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు  నిర్వహిస్తున్నారు. దీనికి  సంబంధించి ఇంకా పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

కాగా ఇదే కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని గత వారం మూడు రోజుల పాటు ప్రశ్నించారు. అంతకుముందు జూన్‌లో రాహుల్ గాంధీని కూడా ఐదు రోజుల పాటు దాదాపు 50 గంటల పాటు విచారించారు