King Cobras Fight: కొండచిలువ, కింగ్‌కోబ్రా నడుమ భీకర పోరు..గెలుపెవరిదో తెలియాలంటే వీడియో చూడాల్సిందే..

ఇది చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ సూపర్ డూపర్ ఫైట్ వీడియో మిలియన్ల కొద్దీ లైక్‌లతో ట్రెండింగ్ వీడియోగా మారింది.

King Cobras Fight: కొండచిలువ, కింగ్‌కోబ్రా నడుమ భీకర పోరు..గెలుపెవరిదో తెలియాలంటే వీడియో చూడాల్సిందే..
Dangerous
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2022 | 11:40 AM

King Cobras Fight: ఇంటర్నెట్‌లో షేర్ చేయబడిన అనేక వీడియోలు మనల్ని నవ్విస్తాయి. కొన్నిసార్లు మనల్ని ఆలోచింపజేస్తాయి. చాలా సార్లు ఆశ్చర్యకరంగా, షాకింగ్ వీడియోలు కూడా ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. కొన్నిసార్లు సోషల్ మీడియాలో విషాదకర వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు పాముల వీడియోలను చూసేందుకు కూడా నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే, మీరు గతంలో పాముల ప్రేమను చూసే ఉంటారు. వాటి మధ్య సంఘర్షణను కూడా చూసే ఉంటారు. కానీ, చూపరులను భయాందోళనకు గురిచేస్తూ రోడ్డుపైకి వచ్చి భీకరంగా ఫైట్‌ చేస్తున్న నాగుపాము, కొండచిలువల పోరును ఎవరూ, ఎప్పుడూ చూసి ఉండరు.

మనం ఊహించలేని విషయాలనీ చూసే వారు.. వాటిని వీడియోలుగా, ఫొటోలుగా రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయబడిన వీడియో చూడటం చాలా అరుదు. అలాంటిదే ఈ వీడియో కూడా.. యూట్యూబ్‌లో షేర్ చేయబడింది. ఇది చూసిన నెటిజన్లు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు మిలియన్ల మంది వీక్షించారు. ఈ సూపర్ డూపర్ ఫైట్ వీడియో మిలియన్ల కొద్దీ లైక్‌లతో ట్రెండింగ్ వీడియోగా మారింది.

ఈ వీడియోలో రెండు పెద్ద పాములు ఒకదానిని ఒకటి చంపుకునేందుకు పోరాడుతున్నాయి. నడి రోడ్డుపై రెండు భయంకర పాములు అల్లుకున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే ఈ బంధం ప్రేమ కోసం కాదని తేలిపోయింది. రెండింటిలో ఏ ఒక్క పాము..వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు.ఈ జీవన్మరణ యుద్ధంలో ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తెలుసుకోవడం కష్టం. ఈ వైరల్ వీడియో చూసి ఎవరు గెలుస్తారో మీరేమైనా ఊహించగలరా..?

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఈ పాముల పోరాటం అద్భుతం. ఈ వీడియో చూసిన చాలా మంది రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వీడియో చివర్లో ఒక పాము మరో పాము నుండి తప్పించుకుని పారిపోతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు తమ భయాన్ని తమ కామెంట్స్‌ రూపంలో ప్రస్తావించారు. వీడియోపై భిన్నమైన కామెంట్స్‌ వచ్చాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి