Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ మహల్‌లో ఇకపై షూటింగ్స్‌ నిషేధం.. భారత పురావస్తుశాఖ ఆదేశాలు

ప్రజలను బెదిరించేలా ఎలాంటి అనుమతులు లేకుండా బహిరంగంగా చిత్రీకరించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు పురావస్తు శాఖ ఎలా అనుమతి ఇచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది.అంతేకాకుండా..

శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ మహల్‌లో ఇకపై షూటింగ్స్‌ నిషేధం.. భారత పురావస్తుశాఖ ఆదేశాలు
Thirmalai Nayakar Mahal
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 02, 2022 | 10:24 AM

శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ మహల్‌లో ఇకపై ఎలాంటి షూటింగ్స్‌ నిర్వహించరాదని భారత పురావస్తు శాఖ (ASI) సంచలన ఆదేశాలు జారీ చేసింది. మదురైలోని 300 సంవత్సరాల పురాతనమైన తిరుమల నాయక్కర్ మహల్ దక్షిణాదిన అతి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలలో ఒకటి. భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని  నిత్యం భారీ సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు.  ప్రతి యేటా ఇక్కడ వందకు పైగా  సినిమా షూటింగ్ లు జరుగుతుంటాయి. అయితే,  సినిమాల షూటింగ్ సమయంలో శతాబ్దాల చరిత్ర కలిగిన మహల్ గోడలు, స్తంభాలు దెబ్బతిన్నాయని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక్కడ సినిమా షూటింగ్ లను నిలిపివేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు. దీంతో 2011 లోనే సినిమా షూటింగ్‌లపై కోర్టు నిషేధం విధించింది.

ఈ పరిస్థితిలో కొద్దిరోజుల క్రితం తిరుమల నాయక్కర్ మహల్ లోపల ఎలాంటి అనుమతి లేకుండా షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించడం వివాదాన్ని రేపింది.  ఆ షార్ట్ ఫిల్మ్ లో రద్దీగా ఉండే ప్రాంతంలో తుపాకులు వాడటం వంటి సన్నివేశాలను  చిత్రీకరించడంపై ఫిర్యాదు అందింది. పర్యాటకులను భయబ్రాంతులకు  గురిచేసేలా ఈ షార్ట్ ఫిల్మ్‌కు పురావస్తు శాఖ ఎలా అనుమతి ఇచ్చిందన్న ప్రశ్న తలెత్తుతోంది. అంతేకాకుండా తిరుమల నాయక్కర్ మహల్‌లో చిత్రీకరించిన షార్ట్ ఫిల్మ్ వీడియో ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సంచలనం సృష్టించింది.

ఈ నేపథ్యంలో మదురై తిరుమల నాయక్ మహల్‌లో పెళ్లి, పుట్టినరోజు ఫోటో షూట్‌లకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్‌లు, ప్రకటనల తయారీని శాశ్వతంగా నిషేధిస్తూ మదురై జోనల్ ఆర్కియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి