Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karnataka: బెంగళూరు – మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తయ్యేది అప్పుడే.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి

బెంగళూరు - మైసూరు జాతీయ రహదారిపై (Bengaluru-Mysuru highway) కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొదటి దశ పునరుద్ధరణ పనులు సెప్టెంబర్ లో పూర్తవుతాయని వెల్లడించింది. దక్షిణ కన్నడ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ అడిగిన ప్రశ్నకు..

Karnataka: బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే పూర్తయ్యేది అప్పుడే.. కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి
Bangaluru Mysuru High Way
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 02, 2022 | 10:44 AM

బెంగళూరు – మైసూరు జాతీయ రహదారిపై (Bengaluru-Mysuru highway) కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొదటి దశ పునరుద్ధరణ పనులు సెప్టెంబర్ లో పూర్తవుతాయని వెల్లడించింది. దక్షిణ కన్నడ ఎంపీ నళిన్ కుమార్ కటీల్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈ మేరకు సమాధానమిచ్చారు. మైసూరు నుంచి నిడఘట్ట (మద్దూరు సమీపంలో) మధ్య 61 కి.మీల విస్తరణ పనులు సెప్టెంబర్ ప్రారంభంలో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.2,919 కోట్లు విడుదల చేయగా.. రూ.1,939 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. కాగా.. నిడఘట్ట – బెంగళూరు మధ్య 56.2 కి.మీ.లు ఈ ఏడాది అక్టోబర్ 20 నాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 10 లేన్ల మైసూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌ వే లోని ఆరు ప్రధాన క్యారేజ్‌ వేలు ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి ఉపయోగానికి సిద్ధంగా ఉంటాయని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు. డిజైన్ రోడ్లు, లింక్ రోడ్లను అనుసంధానం చేయడం మినహా మిగతా పనులన్నీ పూర్తయ్యాయని వివరించారు. ఎక్స్‌ప్రెస్‌ వే సిద్ధమైన తర్వాత రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం మూడు గంటల నుంచి 90 నిమిషాలకు తగ్గుతుందని గడ్కరీ పేర్కొ్న్నారు.

పూర్తిస్థాయిలో పూర్తైన ఈ ఎక్స్‌ప్రెస్‌ వే ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్వాసితుల డిమాండ్‌లతో ఆలస్యం అవుతోందని ఎంపీ ప్రతాప్‌సింహ అన్నారు. గాణగూరు టోల్‌ప్లాజా, శ్రీరంగపట్నం, మాండ్య, మద్దూరు, బిడాది, రామనగర్‌లలో విశ్రాంతి స్థలాలతో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను మార్చాలని కోరారు. బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌ వే రెండు నగరాలను చిక్కమంగళూరు, కొడగు, మంగళూరు, కేరళలోని కొన్ని ప్రాంతాలతో సహా అనేక ఇతర ప్రాంతాలకు లింక్ చేసేందుకు అవకాశముంది. వారాంతాల్లో, సెలవు రోజుల్లో రెండు నగరాల మధ్య భారీ ట్రాఫిక్‌ను ఎదుర్కొనేందుకు ఈ హైవే నిర్మితమవుతోంది. ఈ విస్తరణలో 72 వంతెనలు, 41 వాహన అండర్‌పాస్‌లు, 13 పాదచారుల అండర్‌పాస్‌లు, నాలుగు రైలు ఓవర్‌ బ్రిడ్జ్‌లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి