Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ జోరువాన.. జులై రికార్డును తిరగరాసిన వర్షాలు

మంగళవారం ఉదయం హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, కూకట్ పల్లి, మియాపూర్‌, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, మూసాపేట, కేపీహెచ్‌బీ, ఎర్రగడ్డ, లక్డీకాపూల్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్,...

Hyderabad Rains: హైదరాబాద్ లో మళ్లీ జోరువాన.. జులై రికార్డును తిరగరాసిన వర్షాలు
Rains In Hyderabad
Follow us
Ganesh Mudavath

|

Updated on: Aug 02, 2022 | 10:15 AM

మంగళవారం ఉదయం హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తోంది. పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకపూల్, కూకట్ పల్లి, మియాపూర్‌, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, మూసాపేట, కేపీహెచ్‌బీ, ఎర్రగడ్డ, లక్డీకాపూల్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్‌, బేగంపేట, మెహదీపట్నం, ఉప్పల్‌, కవాడిగూడ, భోలక్ పూర్, జవహర్‌నగర్, దిల్ సుఖ్ నగర్, చాదర్​ఘాట్, గాంధీనగర్, దోమలగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్, మలక్​పేట్, వనస్థలిపురం, ఎల్బీనగర్‌, హయత్ నగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం కురవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మంగళ, బుధ వారాల్లో తెలంగాణలోని పలు చోట్లు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితర ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్‌ ప్రాంతం వరకూ విస్తరించిందని తెలిపారు. అంతే కాకుండా తమిళనాడుపై 1,500 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఇవాళ, రేపు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

కాగా సోమవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా బంట్వారంలో అత్యధికంగా 9.3 సెంటీమీటర్లు వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని ఈస్ట్‌ ఆనంద్‌బాగ్‌ వద్ద 8.4, వెస్ట్‌ మారేడ్‌పల్లిలో 8.1 సెంటీమీటర్ల వర్షం పడిందని అధికారులు వివరించారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో జులై- 2022 రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. నిజామాబాద్‌ జిల్లాలో ఏకంగా 300 శాతం అదనపు వర్షపాతం రికార్డ్ అయింది. ఆ తర్వాత జగిత్యాల 249 కు 895.5 మి.మీ.లు కురిసి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర సగటు వర్షపాతం 281.5 కు గాను 535.5 మిమీల వర్షం కురిసింది.

రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా అధికంగా నమోదవుతున్నాయి. 5.1 డిగ్రీలు అదనంగా పెరగడంతో ఉక్కపోత అధికమైంది. ఖమ్మం జిల్లా సిరిపురంలో అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరగడం, ఉక్కపోత, వ్యవసాయ పనులతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఇళ్లతో పాటు పరిశ్రమలు, వ్యవసాయానికి డిమాండ్‌ అనూహ్యంగా పెరుగింది. 2021 జులైలో 31న గరిష్ఠంగా 11,512 మెగావాట్లు నమోదవగా.. 2022 జులైలో అంతకన్నా 956 మెగావాట్ల వరకూ అదనంగా పెరిగింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి