Telugu News Trending A video of biryani bowls being washed away in flood water has gone viral on social media Telugu viral
Viral Video: ఫాస్టెస్ట్ డెలివరీ అంటే ఇదే బాసూ.. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే నగర రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరద నీరు నదులను తలపిస్తున్నాయి. జూలై 29న హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం...
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొద్దిపాటి వర్షానికే నగర రోడ్లు నదులను తలపిస్తున్నాయి. వరద నీరు నదులను తలపిస్తున్నాయి. జూలై 29న హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నాలాలు పొంగి నీరు ఉప్పొంగింది. ఓ బిర్యానీ (Biryani) హౌస్ నీట మునిగింది. అయితే వరద ప్రవాహంలో ఏకంగా బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోవడం ఆసక్తికరంగా మారింది. ఒకదానిపై ఒకటి పెట్టిన రెండు పెద్ద పాత్రలు పడవల్లా వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవాబ్ సాహెబ్ కుంటలోని ఆదిబా హోటల్ భారీగా కురిసిన వర్షానికి నీట మునిగింది. హోటల్ ముందు పెట్టిన రెండు పెద్ద బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోయాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కొద్ది సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. బిర్యానీ గిన్నెలు కొట్టుకుపోతున్నాయి. బిర్యానీ ఆర్డర్ అందించేందుకు తమంతట తామే వెళ్తున్నాయని ఒకరు, ఈ బిర్యానీ గిన్నెలు ఎవరి ఇంటికి చేరుతాయోగానీ వారికి మాత్రం పండుగేనని మరొకరు, ఇదో సరికొత్త హోం డెలివరీ సర్వీసులా ఉందని ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.