Telugu News Trending man lifting bike video was gone viral in Social media viral news
Video Viral: ఇతనే రియల్ బాహుబలి.. బైక్ ను అమాంతం ఎత్తేశాడు.. అంతే కాకుండా
సోషల్ మీడియాలో (Social Media) రోజూ రకరకాల వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి. వీటిని చూస్తూ టైం కూడా మర్చిపోయే వారు చాలామందే ఉన్నారు. అలాంటి వీడియోల్లో కొన్ని భయం కలిగిస్తే, మరికొన్ని ఔరా అనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ట్యాలెంట్ కు కొదవ...
సోషల్ మీడియాలో (Social Media) రోజూ రకరకాల వీడియోలు పోస్ట్ అవుతూ ఉంటాయి. వీటిని చూస్తూ టైం కూడా మర్చిపోయే వారు చాలామందే ఉన్నారు. అలాంటి వీడియోల్లో కొన్ని భయం కలిగిస్తే, మరికొన్ని ఔరా అనిపిస్తాయి. ఈ ప్రపంచంలో ట్యాలెంట్ కు కొదవ లేదు. ఎంతో మందిలో ఈ ట్యాలెంట్ దాగున్నప్పటికీ.. అది బయటపడేందుకు సరైన మాధ్యమం ఉండదు. అలాంటి వారికి సోషల్ మీడియా దిక్సూచిలా మారింది. తమలోని ట్యాలెంట్ ను బయటి ప్రపంచానికి తెలిపేందుకు కొందరు ఇంటర్నెట్ ను ఉపయోగించుకుంటున్నారు. కొద్ది కాలంలోనే జనాలకు చేరువవుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. ఒక వ్యక్తి ఏదైనా చేయాలని నిశ్చయించుకుంటే, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలననే నమ్మకం ఉండాలి. ఈ క్లిప్ లో ఓ వ్యక్తి తన తలపై ఎటువంటి సపోర్ట్ లేకుండా సుమారు 150 కిలోల బరువైన బైక్ ను అవలీలగా ఎత్తేశాడు. అంతే కాకుండా దానిని బస్సు పైకి ఎక్కించాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని ప్రంశంసిస్తున్నారు.
लोगों को अपना परिश्रम संघर्ष लगता है और दूसरों का तमाशा।
ఈ వీడియో ట్విట్టర్ ద్వారా పోస్ట్ అయింది. ఈ వీడియోకు ‘ప్రజలు తమ కార్మిక పోరాటం కోసం ఎంతైనా కష్టపడతారు’ అనే శీర్షిక రాశారు. ఈ క్లిప్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఇప్పటివరకు 80 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అంతే కాకుండా నెటిజన్లు తమ అభిప్రాయాన్ని కామెంట్లు రూపంలో వ్యాఖ్యానిస్తున్నారు. ‘ఈ స్టంట్‌ని బాహుబలి ప్రభాస్‌కి, జాన్ ఆఫ్ ఫోర్స్‌కి చూపించాలని’, ‘వావ్! బ్యాలెన్స్ సూపర్ ‘ అని కామెంట్లు చేస్తున్నారు.