Health: నీళ్లు ఎక్కువ తాగితే బరువు పెరుగుతారా.. డైట్ సమయంలో నిజంగానే బరువు తగ్గుతారా

సృష్టిలోని సమస్త ప్రాణకోటికి నీరు (Water) అత్యంత ఆవశ్యకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే. నీరు లేనిదే భూమిపై ఏ జీవీ మనుగడ సాధించలేదు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో వాటర్ వెయిట్ అనే అంశం తెరపైకి వచ్చింది. బరువును చూసే మిషన్ పై....

Health: నీళ్లు ఎక్కువ తాగితే బరువు పెరుగుతారా.. డైట్ సమయంలో నిజంగానే బరువు తగ్గుతారా
Water Health
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 30, 2022 | 6:04 PM

సృష్టిలోని సమస్త ప్రాణకోటికి నీరు (Water) అత్యంత ఆవశ్యకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే. నీరు లేనిదే భూమిపై ఏ జీవీ మనుగడ సాధించలేదు. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో వాటర్ వెయిట్ అనే అంశం తెరపైకి వచ్చింది. బరువును చూసే మిషన్ పై నిలబడినప్పుడు అది మన శరీరం మొత్తం బరువును చూపిస్తుంది. అయితే మన బాడీలో అధికశాతంలో నీరే ఉంటుంది. అందుకే బరువు తగ్గడం మొదలైనప్పుడు మొదటగా వాటర్ వెయిట్ మాత్రమే తగ్గుతుంది. మనం తీసుకునే నీరు, ఆహారంలోని నీటి అణువులను గ్లైకోజెన్ నిల్వ చేస్తుంది. ఒక గ్రాము గ్లైకోజెన్ మూడు గ్రాముల నీటిని స్టోర్ చేస్తుంది. వాటర్ వెయిట్ (Weight) కారణంగా శరీర బరువులో తరచూ మార్పులు జరుగుతుంటాయి. వాటర్ వెయిట్ పెరగడం అనేది జన్యువులు, అనువంశికత, మనం తీసుకునే నీటి పరిమాణం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అధిక బరువుతో బాధపడేవారు తమ బరువును తగ్గించుకునేందుకు చాలా కసరత్తులు చేస్తారు. జిమ్ లో కష్టపడటం, చెమటలు చిందించడం, ఆహారం మితంగా తీసుకోవడం వంటి చర్యలు చేస్తారు. అయితే అప్పుడు తగ్గుతున్న బరువు ఫ్యాట్ వెయిట్ లేక వాటర్ వెయిట్ అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇందుకు ఓ ట్రిక్ ఫాలో అవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రికి రాత్రి లేదా ఒక రోజులో ఒక కిలో తగ్గారనుకోండి. అది పూర్తిగా వాటర్ వెయిటే. సాధారణంగా, చాలా మంది వారానికి ఒక కిలో లేదా ఒకటిన్నర కిలోల బరువు తగ్గుతారు. కాబట్టి తగ్గుతున్నది బాడీ వెయిట్ లేదా వాటర్ వెయిట్ అనే విషయాన్ని మనం సులభంగా కనుక్కోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.