AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మనుషులకైనా జంతువులకైనా తల్లిప్రేమ ఒకటే.. బిడ్డను ఎత్తుకుని లాలించి, ముద్దులు పెడుతూ

తల్లీ బిడ్డల మధ్య ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. నవమోసాలు మోసిన అమ్మకు పిల్లలపై ఎనలేని మమకారం ఉంటుంది. మాతృత్వం అనేది మనుషుల్లోనే కాదు..జంతువుల్లోనూ ఉంటుంది. దీనిని నిరూపించే ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది....

Viral Video: మనుషులకైనా జంతువులకైనా తల్లిప్రేమ ఒకటే.. బిడ్డను ఎత్తుకుని లాలించి, ముద్దులు పెడుతూ
Gorilla Video Viral
Ganesh Mudavath
|

Updated on: Jul 29, 2022 | 5:56 PM

Share

తల్లీ బిడ్డల మధ్య ఉన్న అనుబంధాన్ని మాటల్లో చెప్పలేం. నవమోసాలు మోసిన అమ్మకు పిల్లలపై ఎనలేని మమకారం ఉంటుంది. మాతృత్వం అనేది మనుషుల్లోనే కాదు..జంతువుల్లోనూ ఉంటుంది. దీనిని నిరూపించే ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కెనడాలోని జూ పార్కులో ఓ గొరిల్లా తన బిడ్డను చూసుకుని మురిసిపోయింది. దానికి ముద్దులు పెడుతూ, ఎత్తుకొని ఆడిస్తూ ప్రేమానురాగాలు పంచింది. అంతే కాదు.. తన బిడ్డను సందర్శకులకు చూపిస్తూ పొంగిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇది ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ అయింది. 24 గంటలలోపే, ఒక లక్షకు పైగా వ్యూస్, 14 వేలకు పైనే లైక్‌లు వచ్చాయి. ఈ క్లిప్‌లో ఆడ గొరిల్లా తన బిడ్డను ముద్దుపెట్టుకోవడం, లాలించడం కనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్ల మనసు భావోద్వేగంతో నిండిపోయింది. తల్లీ బిడ్డల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది అచ్చం మనుషుల వలె ఉందని కామెంట్లు చేస్తున్నారు.

కాగా.. జంతువులను బోనులో ఉంచడాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. వాటిని స్వేచ్ఛగా వదిలేయాలని కోరుతున్నారు. గత నెలలో ఓ గొరిల్లా సైకిల్ తొక్కుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఘటనను మరవకముందే మరో గొరిల్లా తన బిడ్డపై అపార ప్రేమను కురిపించే వీడియో ప్రస్తుతం నెటిజన్లు మనసులకు ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
కల్యాణ్, ఇమ్మూలది తొండాట..టాప్ కంటెస్టెంట్స్ గుట్టురట్టు.. వీడియో
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బీసీసీఐకి ఇండిగో చుక్కలు..పుణె వైపు పరుగులు పెట్టిన ప్లేయర్లు
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు