Viral: ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. పార్శిల్ ఓపెన్ చేసి చూడగా దిమ్మతిరిగిపోయింది!

ఈ మధ్యకాలంలో చాలామంది జనాలు ఆన్‌లైన్ షాపింగ్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇక్కడ..

Viral: ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన వ్యక్తి.. పార్శిల్ ఓపెన్ చేసి చూడగా దిమ్మతిరిగిపోయింది!
Online Parcel
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 29, 2022 | 12:22 PM

అరచేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చేయడంతో ఏ వస్తువు కావాలన్నా.. కాలు కదపకుండానే మన దగ్గరకు వచ్చేస్తోంది. హెయిర్ క్లిప్స్ దగ్గర నుంచి ల్యాప్‌టాప్స్‌ వరకు ప్రతీ వస్తువు ఒక్క క్లిక్‌తో ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేయొచ్చు. అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది జనాలు ఆన్‌లైన్ షాపింగ్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే ఇక్కడ సరైన జాగ్రత్త తీసుకోకపోతే.. మోసపోవడం కూడా ఖాయం. ఇటీవల కాలంలో ఆన్‌లైన్ మోసాలు చాలా చోట్ల జరిగిన సందర్భాలు లేకపోలేదు. ఆర్డర్ పెట్టింది ఒకటయితే.. పార్శిల్‌లో వచ్చేది మరొకటి. తాజాగా అలాంటి కోవకు చెందిన ఓ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. పాట్నా నగర సమీపంలోని ఫత్వాః ప్రాంతానికి చెందిన సౌరభ్ సుమన్ అనే యువకుడు తన షాప్ అవసరాల నిమిత్తం జూలై 24వ తేదీన రూ. 34,600 విలువ చేసే ల్యాప్‌టాప్‌ను ఈ-కామర్స్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాడు. కొద్దిరోజుల తర్వాత అమెజాన్ నుంచి పార్శిల్ ఇంటికి చేరుకుంది. ఎంతో ఉత్సాహంగా దాన్ని ఓపెన్ చేసి చూడగా అతడికి ఒక్కసారిగా దిమ్మతిరిగిపోయింది. ల్యాప్‌టాప్‌కు బదులుగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ గైడ్, ఇటుక ముక్కలు పార్శిల్‌లో ఉండటాన్ని చూసి దెబ్బకు ఖంగుతిన్నాడు. వెంటనే దానంతటిని చిన్న వీడియో క్లిప్ కింద తీసి అమెజాన్ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేశాడు. నెలాఖరులోగా దర్యాప్తు చేసి.. పూర్తి సమాచారాన్ని అందిస్తామని అమెజాన్ తిరిగి రిప్లయ్ ఇచ్చింది.