Etela Rajender: తగ్గేదే లే అంటున్న ఈటల.. టీవీ9తో మీటింగ్‌లో షాకింగ్ కామెంట్స్..!

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా ఈటల రాజేందర్ మారుతున్నారు. హుజూరాబాద్‌ విజయంతో పాపులారిటీ పెంచుకున్న ఈటల..

Etela Rajender: తగ్గేదే లే అంటున్న ఈటల.. టీవీ9తో మీటింగ్‌లో షాకింగ్ కామెంట్స్..!
Etela Rajender
Follow us

|

Updated on: Jul 29, 2022 | 1:26 PM

Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా ఈటల రాజేందర్ మారుతున్నారు. హుజూరాబాద్‌ విజయంతో పాపులారిటీ పెంచుకున్న ఈటల.. తాజాగా ఇతర పార్టీ నాయకులకు కాషాయం కండువా కప్పే స్పెషల్‌ ఆపరేషన్‌లో బిజీ బిజీగా ఉన్నారు. 12 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటున్న ఈ మాజీ మంత్రి.. కేసీఆర్‌ను ఓడించేది కూడా తానే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన నెక్ట్స్ టార్గెట్ గజ్వేల్ అంటున్న ఈటల రాజేందర్.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ముఖ్య నాయకులను బీజేపీ వైపు లాగే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ నాయకత్వం ఈటలకు కీలక బాధ్యతలు అప్పగించారు. మరి ఈటల చెబుతున్నట్లు ఆయనతో టచ్‌లో ఉంది ఎవరు? కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి భారీగా నేతలు చేరబోతున్నారా? ఇదే అంశంపై టీవీ9 బిగ్ డిబేట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు.

హుజూరాబాద్ తర్వాత కొత్తగా తనకేమీ పాపులారిటీ రాలేదన్న ఈటల రాజేందర్.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌‌ను ఓడించాలని దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు భవిష్యత్ లేదని జనం నమ్ముతున్నారన్నారు. ప్రజాభిప్రాయాన్ని నేతలు గమనిస్తున్నారని.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొచ్చారు ఈటల రాజేందర్. అయితే, మార్కెట్‌లో సరుకుల్లా తాము ఎవరినీ తీసుకోబోమని స్పష్టం చేశారు.

ఇక హిందుత్వ అజెండాపై స్పందించిన ఈటల రాజేందర్.. రాజకీయాలు ఎప్పుడూ స్టేబుల్‌గా ఉండవని, డైనమిక్‌గా ఉంటాయని చెప్పుకొచ్చారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పాలన ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ గెలుపునకు సంబంధించి, పార్టీ బలోపేతానికి సంబంధించి ఈటల చేసిన ఆసక్తికర కామెంట్స్ గురించి ఈ వీడియోలో చూడొచ్చు.

మరిన్ని బిగ్‌ న్యూస్‌ బిగ్ డిబేట్‌ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..