Andhra Pradesh: అబద్ధాల మార్క్ పాలన కావాలా..? వివక్ష లేని పాలన కావాలా..? మీరే నిర్ణయించుకోండి.. సీఎం జగన్

వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (CM.Jagan) విడుదల చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఈ పథకం ద్వారా మూడేళ్లల్లో ఒక్కొక్కరికీ రూ.45....

Andhra Pradesh: అబద్ధాల మార్క్ పాలన కావాలా..? వివక్ష లేని పాలన కావాలా..? మీరే నిర్ణయించుకోండి.. సీఎం జగన్
Cm Ys Jagan
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 29, 2022 | 3:17 PM

వైఎస్సార్ కాపు నేస్తం మూడో విడత నిధులను ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (CM.Jagan) విడుదల చేశారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఈ పథకం ద్వారా మూడేళ్లల్లో ఒక్కొక్కరికీ రూ.45 వేలు అందాయన్నారు. అంతే కాకుండా రెండున్నర లక్షల మంది కాపులకు ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు సీఎం వెల్లడించారు. అన్ని వర్గాల జీవన ప్రమాణాలు పెంచాలన్నదే తన ప్రభుత్వ లక్ష్యమని, ఆ విధంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. డీబీటీ ద్వారా రూ.16,256 కోట్లు అందించామని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా నేరుగా సంక్షేమ పథకాల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ పాలనలో అంతా డీపీటీనే ( దోచుకో, పంచుకో, తినుకో). చంద్రబాబు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. హుద్‌హుద్‌ తుపాను వచ్చినప్పుడు నేను 11 రోజుల పాటు స్వయంగా ఉత్తరాంధ్రలో తిరిగా. ఆ సమయంలో నిర్వాసితులకు పాచిపోయిన పులిహోర అందించారు. వైసీపీ పాలనలో మాత్రం వరద బాధితులను సక్రమంగా ఆదుకుంటున్నాం. ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. అబద్దాల మార్క్‌ చంద్రబాబు కావాలా? ఎలాంటి వివక్ష లేకుండా అర్హులందరికీ పథకాలు అందిస్తున్న ఈ ప్రభుత్వం కావాలా?.. ఇక మీరే నిర్ణయించుకోండి.

        – వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..