Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: లోన్ యాప్ వేధింపులకు వివాహిత బలి.. లైవ్‌లో కన్నీటి పర్యంతం అయిన TV9 యాంకర్

లోన్ యాప్స్ జనాలను మింగేస్తున్నాయి. బయటకు చెప్పుకోలేని రీతిలో టార్చర్ చేస్తూ మానసికంగా వేధిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో లోన్ యాప్స్ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం.

Andhra Pradesh: లోన్ యాప్ వేధింపులకు వివాహిత బలి.. లైవ్‌లో కన్నీటి పర్యంతం అయిన TV9 యాంకర్
Loan Apps Harassment
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 29, 2022 | 3:32 PM

క్రెడిట్‌ కార్డు రుణ వేధింపులు నందిగామలో యువతి ప్రాణాలు తీస్తే…15 రోజుల కిందట లోన్‌ యాప్‌ వేధింపులు ఓ యువతి ప్రాణాలు తీశాయి. అప్పు ఇచ్చినట్టే ఇచ్చి.. అధిక వడ్డీలు వసూలు చేసే విషయంలో రాక్షసుల్లా పీక్కుతినే లోన్ యాప్‌లకు గుంటూరు జిల్లా( guntur district)లో యువతి బలైంది. చావుకు ఆ లోన్ యాపే కారణం అని చెప్పిమరీ చనిపోయిందా అభాగ్యురాలు. మంగళగిరి మండలం(Mangalagiri mandal) చినకాకాని(Chinakakani)కి చెందిన యువతి బండపల్లి ప్రత్యుష. 24 ఏళ్ల ప్రత్యూషకు ఇటీవలే పెళ్లయింది. హాయిగా సాగుతున్న ఈమె జీవితానికి శాపంలా మారింది రుణ వ్యవహారం. లోన్‌ యాప్ ద్వారా కొంత మొత్తం అప్పు తీసుకుంది ప్రత్యూష. ఆ తర్వాత వాళ్లు చెప్పినట్టే విడతల వారీగా డబ్బు తిరిగి చెల్లిస్తూ వస్తోంది. ఇంకా 8 వేలు మాత్రమే బకాయి ఉంది. అప్పులు చెల్లించాలంటూ ఆమెకు లోన్‌ యాప్ కాల్ సెంటర్ నుంచి వేధింపులు పెరిగాయి.  తీవ్ర దీంతో తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌కు ముందు తల్లిదండ్రుల్ని, భర్తను ఉద్దేశిస్తూ సెల్ఫీ వీడియో పంపింది ప్రత్యూష. లోన్‌యాప్ వాళ్ల బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేకే వెళ్లిపోతున్నా అంటూ ఎమోషనల్‌గా మాట్లాడిందామె. ఫోటోలను మార్ఫ్ చేసి చుట్టాలకు పంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారని..  బంధువులకు సమాధానం చెప్పలేనని.. అవి తన ఫోటోలు కాదని చెప్తూ ఆమె ఎమోషనల్ అయ్యింది.

ఎక్కువగా దిగువ మధ్యతరగతి, పేద వర్గాలను లోన్ యాప్స్ మాఫియా టార్గెట్ చేస్తోంది. వారి ఆర్థిక ఇబ్బందులకు.. ఇనిస్టంట్ మనీని ఎరగా వేస్తుంది. లోన్ తీసుకున్నాక.. అధిక వడ్డీలు వసూలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. లోన్ కట్టడం లేట్ అయితే అశ్లీల ఫోటోలతో.. బాధితుల ఫోటోలు మార్ఫింగ్ చేసి సర్కులేట్ చేస్తున్నారు. దీంతో అవమానం భారం తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యూష తల్లి మాధవితో లైవ్ షో నిర్వహించింది టీవీ9. తల్లి స్థానంలో ఉండి.. తన కుమార్తె వయసున్న యువతీయువకులకు ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఓ సలహా ఇచ్చారు. ఇలాంటి కడుపు కోత బిడ్డలు ఏ తల్లిదండ్రులకు ఇవ్వొద్దంటూ ప్రాధేయపడ్డారు. లోన్ మాఫియా ఉచ్చులో పడవద్దని కోరారు. లోన్ యాప్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను కోరారు. ఈ క్రమంలోనే ప్రత్యూష మాట్లాడిన ఆఖరి వీడియోను ప్లే చేసిన సందర్భంలో ప్రత్యూష తల్లి కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ సమయంలో షోను హోస్ట్ చేస్తున్న టీవీ9 యాంకర్ ప్రత్యూష సైతం బావోద్వేగానికి లోనయ్యారు. ఆ యువతి ఆఖరి మాటలను విని కన్నీరు పెట్టుకున్నారు. గద్గద స్వరంలో మాధవి గారికి ధైర్యం చెప్పారు. లైవ్ జరిగినంత సేపు కూడా యాంకర్ ప్రత్యూష ఉద్వేగభరితంగా కనిపించారు. ఆ వీడియో దిగువన చూడండి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..