AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: చెట్టుపై అద్భుతం.. సాక్షాత్తూ గణనాథుడి రూపం.. తన్మయత్వంలో భక్తజనం

వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన వినాయకుడికి పూజలు చేస్తున్నాడు. వృక్షంపై విఘ్నేశ్వరుడి స్వరూపాన్ని చూసి భక్తులను తన్మయత్వానికి లోనవుతున్నారు.

Vizag: చెట్టుపై అద్భుతం.. సాక్షాత్తూ గణనాథుడి రూపం.. తన్మయత్వంలో భక్తజనం
Natural Ganesh
Ram Naramaneni
|

Updated on: Jul 29, 2022 | 4:42 PM

Share

Andhra Pradesh: ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలని ఎక్కడైనా సరే తొలి పూజ ఆది దేవుడైన వినాయకుడి చేస్తారు. వినాయకుడు పెద్దలతో పాటు పిన్నలకు ప్రితిపాత్రుడు.. ఇండియాలో వినాయక చవితి ఎంత భక్తిశ్రద్దలతో చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) కూడా వినాయక చవితి అప్పుడు వివిధ రూపాల్లో గణనాథుడి విగ్రహాలు ప్రతిష్టించి.. పూజలు చేస్తారు. అంతే సంబరంతో ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. అయితే వినాయకుడి పండగ ఇంకా రాకుండానే..  ప్రకృతి సిద్ధంగా తయారైన ఓ విఘ్నేశ్వరుడు ఇప్పుడు భక్తుల పూజలు అందుకుంటున్నాడు. స్థానికంగా ఉన్న భక్తులను ఆకర్షిస్తున్నాడు. వివరాల్లోకి వేళ్తే…  సింహాచలం(Simhachalam) పాత గోశాల వద్ద ఓ పెద్ద చెట్టుపైకి తీగ జాతికి చెందిన మొక్క పాకింది. చెట్టుపైన ఈ మొక్క విఘ్నేశ్వరుడి రూపంలో కనిపిస్తుంది. ఈ ఆకారాన్ని చూసిన ఓ వ్యక్తి.. ఆశ్చర్యానికి గురై స్థానికంగా ఉండే ఇతర వ్యక్తులకు కూడా ఈ విషయాన్ని చెప్పాడు. దీంతో భక్తులు గణనాథుడే ఇలా దర్శనమిస్తున్నాడని భావించి.. పూజలు చేస్తున్నారు. స్వామి ఆకారం చెట్టుపైన ఉండటంతో.. అక్కడే ఓ బెంచ్ వేసి.. పూజలు చేసి.. తీర్థప్రసాదాలు సమర్పిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటున్నారు.

వినాయకుడు ఈ ఆకారం ద్వారా ఓ మెసేజ్ పంపారని ఇంకొందరు అంటున్నారు. వచ్చే వినాయక చవితికి అందరూ ప్రకృతి సిద్ధంగా  మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని దేవుడు సందేశం పంపాడని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రకృతి గణపతి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను బాగా ఆకర్షిస్తున్నాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..