Cholesterol: కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే.. ఈ టేస్టీ అండ్‌ హెల్దీ డ్రింక్స్‌ను డైట్‌లో చేర్చుకోండి

Health Care Tips: విపరీతమైన పని ఒత్తిడి, యాంత్రిక జీవనంలో పడి నేటి రోజుల్లో చాలామంది తిండి విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటున్నారు. ఫలితంగా పలు ఆరోగ్య సమస్యలను..

Cholesterol: కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవాలంటే.. ఈ టేస్టీ అండ్‌ హెల్దీ డ్రింక్స్‌ను డైట్‌లో చేర్చుకోండి
Healthy Drink
Follow us

|

Updated on: Jul 30, 2022 | 5:27 PM

Health Care Tips: విపరీతమైన పని ఒత్తిడి, యాంత్రిక జీవనంలో పడి నేటి రోజుల్లో చాలామంది తిండి విషయంలో పెద్దగా జాగ్రత్తలు తీసుకోలేకపోతున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తింటున్నారు. ఫలితంగా పలు ఆరోగ్య సమస్యలను చేతులారా కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాన్‌ పరిమాణం గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే.. మన గుండెను ఆరోగ్యంగా ఉండాలంటే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే గుండె పోటుతో పాటు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రించుకోవడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. అలాగే హెల్దీ డ్రింక్స్‌ను కూడా తీసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం రండి.

దానిమ్మ రసం

దానిమ్మ రసం చాలా రుచికరమైనది అలాగే ఆరోగ్యకరమైనది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్‌ని రోజూ తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్లు, మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్ శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ జ్యూస్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

టొమాటో రసం

టొమాటోలో లైకోపీన్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే నియాసిన్ కొలెస్ట్రాల్‌ను అదుపుచేస్తుంది. ఇక ఇందులోని ఫైబర్‌ కూడా జీర్ణాశయ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

గ్రీన్ టీ

బరువు తగ్గడానికి గ్రీన్ టీని ఎక్కువగా తాగుతారు. ఇందులో కేటెచిన్స్ ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు, గుండెపోటు, మధుమేహం వంటి సమస్యలను నివారించడంలో ఇవి సహాయపడతాయి.

వీటితో పాటు చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, ఆహారంలో పచ్చని కూరగాయలను చేర్చుకోవాలి. బ్రోకలీ, బచ్చలికూర, ఓక్రా వంటి కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఆపిల్, బొప్పాయి, అవకాడో, నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అలాగే సోయాబీన్ నూనె, నువ్వుల నూనె, లిన్సీడ్ నూనె, ఆలివ్ నూనె లను వంటల్లో వాడుకోవాలి.

గమనిక.. ఈ విషయాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే..వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
ఎండ వేడి నుంచి ఉపశమనం కోసం ముస్సోరి బెస్ట్ ఎంపిక..
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..