Viral Video: అమ్మ ప్రేమ ఇలానే ఉంటుంది.. ఆడించాలంటూ సింహం దగ్గరకు వెళ్లిన సింబా.. అమేజింగ్ వీడియో
ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే వెంటనే మనకు అమ్మ గుర్తుకొస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది.
Lion Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం వైరల్ వీడియోలు హల్‌చల్ చేస్తుంటాయి. ఇవి కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వీటిని నెటిజన్లు తెగ ఇష్టపడుతుంటారు. ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు చూస్తే వెంటనే మనకు అమ్మ గుర్తుకొస్తుంది. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ 23 సెకన్ల వీడియో క్లిప్‌ను నెటిజన్లు చూసి ముచ్చటగా ఉందంటూ తెగ ఇష్టపడుతున్నారు. అమ్మ – బిడ్డ ప్రేమ అజరామరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తల్లి, తన బిడ్డను పెంచుతున్నప్పుడు భవిష్యత్తులో రాగల సవాళ్లను ఎదుర్కొనేందుకు.. బాల్యం నుంచే సిద్ధం చేస్తుంది. మనిషి అయినా లేదా జంతువు అయినా తన పిల్లలపై ప్రేమ ఎప్పుడూ తగ్గదు. బిడ్డ కూడా తన తల్లిని ఎక్కువగా ప్రేమిస్తుంది. చిన్న సింహం.. తన తల్లి నిద్రపోతుండగా.. అక్కడికి వెళ్లి తనను లాలించమంటూ మారం చేస్తుంది. సింహం కూడా తన ప్రేమను చూపుతూ పిల్లను కౌగిలించుకుంటుంది.
వైరల్ అవుతున్న వీడియోలో సింహం నిద్రపోతుండటాన్ని మీరు చూడవచ్చు.. అదే సమయంలో పిల్ల సింహం.. నెమ్మదిగా తన తల్లి వద్దకు వచ్చి ప్రేమతో కౌగిలించుకుంటుంది. అది కూడా వెంటనే లేచి బుల్లి సింహాన్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగలించుకొని.. ముద్దాడుతుంది. తనను ఆడించాలంటూ సింబా.. సింహానికి పట్టుబడుతుంది. దీంతో సింహం కూడా నిద్ర నుంచి మేల్కొని.. సింబాను సంతోషంలో ముంచెత్తుతుంది. ఈ వైరల్ అవుతున్న వీడియో అందరి హృదయాలను గెలుచుకుంది.
వీడియో చూడండి
The cuddle? (VC:Nat Geo wild) pic.twitter.com/gP1TYpdjxq
— Susanta Nanda IFS (@susantananda3) July 26, 2022
ఈ వీడియోను IFS సుశాంత్ నందా ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. తల్లి ప్రేమ అద్భుతమైనదంటూ చాలా మంది వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి