Garlic Side Effects: మంచిదని వెల్లుల్లి తెగ తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి

వెల్లుల్లి వినియోగం కొన్ని వ్యాధులు, సమస్యలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే చాలామంది వెల్లుల్లిని తీసుకోవాలని సూచిస్తుంటారు.

Garlic Side Effects: మంచిదని వెల్లుల్లి తెగ తింటున్నారా..? ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి
Garlic
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 30, 2022 | 6:40 AM

Side Effects Of Garlic: వెల్లుల్లిని దాదాపు ప్రతిఒక్కరి వంటింట్లోను ఉంటుంది. చాలామంది వెల్లుల్లిని ఆహారంలో మంచి రుచి, సువాసన కోసం ఉపయోగిస్తారు. అదే సమయంలో వెల్లుల్లి వినియోగం కొన్ని వ్యాధులు, సమస్యలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే చాలామంది వెల్లుల్లిని తీసుకోవాలని సూచిస్తుంటారు. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అటువంటి పరిస్థితిలో వెల్లుల్లిని ఎంత మోతాదులో తీసుకోవాలి? మరి దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు తెలుసుకోండి..

వెల్లుల్లి తినడం వల్ల కలిగే నష్టాలు..

వాంతులు – విరేచనాల సమస్య: వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి. ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తీసుకుంటే మీ కడుపులో మంట సమస్య కూడా తలెత్తుతుంది. అందుకే వెల్లుల్లిని తినేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఇవి కూడా చదవండి

కాలేయానికి హానికరం: వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది. పచ్చి వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కాలేయంలో యాసిడ్ పేరుకుపోతుంది. దీని వల్ల మీకు సమస్యలు రావచ్చు. అందువల్ల మీరు వెల్లుల్లిని ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు.

తలతిరగడం: పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల తలతిరగడం లాంటి సమస్యలు వస్తాయి. అదే సమయంలో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందని, దీని వల్ల మైకము కూడా వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇలాంటి వారు వెల్లుల్లిని తినకూడదు..

వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరికి చాలా హాని కలుగుతుంది. అందుకే కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు వెల్లుల్లిని నివారించాలి. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు వెల్లుల్లి తినడం మానుకోవాలి. అంతే కాకుండా చాలా చిన్న పిల్లలకు వెల్లుల్లి తినిపించడం మంచిది కాదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి