Optical Illusion: అంత ఈజీ కాదండోయ్.. ఈ చిత్రంలో సీతాకోకచిలుక దాగి ఉంది.. కనుక్కుంటే మీరు సూపరే
సాధారణంగా ఆప్టికల్ ఇల్యూజన్.. చిత్రాలలో అనేక విషయాలు దాగుంటాయి. వాటిని కనుగొనడం ఒక కళ. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వచ్చిరాగానే అనేకమంది
Butterfly hidden between plants: సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక ఫొటో వైరల్ అవుతుంటుంది. అలాంటి వాటిలో ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు సైతం ఉంటాయి. ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూజన్.. చిత్రాలలో అనేక విషయాలు దాగుంటాయి. వాటిని కనుగొనడం ఒక కళ. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వచ్చిరాగానే అనేకమంది వాటిలో దాగున్న విషయాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తుంటారు. కొన్నిసార్లు వాటిని పరిష్కరించడం చాలా సులభం, కొన్నిసార్లు ఆ చిత్రాలు మెదడుకే సవాల్ విసురుతుంటాయి. అందుకే చాలామంది ఆప్టికల్ భ్రమకు సంబంధించిన విషయాలను పరిష్కరించడానికి ఇష్టపడతుంటారు. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో ఓ సీతాకోక చిలుక దాగి ఉంది.. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఎక్కడ చూసినా పచ్చదనం దర్శనమిస్తుంది. ఎటు చూసినా మనసుకు సంతోషం కలుగుతుంది. అయితే ఈ వైరల్ ఫోటోలో ఒక సీతాకోకచిలుక చిత్రంలో దాగి ఉంది. దానిని కనుగొనడం చాలా కష్టంగా మారింది. బుర్రకు పదునుపెట్టి, మనసుతో చూస్తూ ఇట్టే కనిపెట్టొచ్చు..
ఇక్కడ చిత్రాన్ని చూడండి
ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ ఫోటో
మీరు కూడా సీతాకోకచిలుకను కనుగొనాలనుకుంటే ఈ చిత్రాన్ని జాగ్రత్తగా చూడండి. దీనిలో సీతాకోక చిలుక కనిపిస్తుంది. ఎంతకనిపెట్టినా దొరకపోతే.. ఇంకో క్లూ కూడా ఇస్తున్నాం.. ఆకుపచ్చ రంగులో సీతాకోకచిలుక దర్శనమిస్తుంది.
మీరు కూడా మీ ఫ్రెండ్స్‌కు సరదాగా ఆటపట్టించాలనుకుంటే.. దీనిని షేర్ చేసి సవాల్ చేయండి..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి