AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves: పరగడుపున నాలుగు కరివేపాకులు తింటే.. ఆ ఐదు సమస్యలు హాంఫట్.. ఇంకా ఎన్నో..

కరివేపాకుతో ఏదైనా ఆహారపు రుచి, సువాసన మెరుగుపడుతుంది. అందుకే చాలా మంది కరివేపాకును కొనుగోలు చేసి మరి వంటలల్లో వేస్తారు.

Curry Leaves: పరగడుపున నాలుగు కరివేపాకులు తింటే.. ఆ ఐదు సమస్యలు హాంఫట్.. ఇంకా ఎన్నో..
Curry Leaves
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2022 | 5:55 AM

Share

Curry Leaves Benefits: భారతీయ వంటశాలలలో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా సౌత్ ఇండియన్ వంటకాలు చాలా వరకు ఈ ఆకులతోనే రుచిగా మారుతాయి. కరివేపాకుతో ఏదైనా ఆహారపు రుచి, సువాసన మెరుగుపడుతుంది. అందుకే చాలా మంది కరివేపాకును కొనుగోలు చేసి మరి వంటలల్లో వేస్తారు. అంతేకాకుండా ఇళ్లలో కరివేపాకు మొక్కలను సైతం పెంచుకుంటుంటారు. ఈ కరివేపాకులతో పలు రకాల వంటకాలతోపాటు.. చట్నీ కూడా చేసుకోని తింటారు.

కరివేపాకులో ఎన్నో పోషకాలు..

కరివేపాకులో భాస్వరం, కాల్షియం, ఇనుము, రాగి, విటమిన్లు, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 4 పచ్చి ఆకులను నమిలి తింటే.. అది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

కరివేపాకు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు

కళ్లకు మంచిది: కరివేపాకు ఆకులను తినడం ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. కరివేపాకులో చూపును మెరుగుపరిచే ముఖ్యమైన పోషకం విటమిన్ ఎ ఇందులో ఉంది. ఇది రేచీకటీ లేదా కంటికి సంబంధించిన అనేక ఇతర వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

డయాబెటిస్‌ బాధితులకు మేలు: కరివేపాకులో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మధుమేహం రోగులు రోజూ తింటే చాలా మంచిది.

జీర్ణక్రియ మెరుగుపడుతుంది: కరివేపాకును ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో నమిలి తింటే చాలామంచిది. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఎసిడిటీ, ఉబ్బరం వంటి అన్ని కడుపు సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది: కరివేపాకులో యాంటీ ఫంగల్, యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వ్యాధుల ప్రమాదాన్ని నివారిస్తుంది.

బరువు తగ్గుతుంది: కరివేపాకును నమిలి తినడం వల్ల బరువు, పొట్ట కొవ్వు తగ్గుతుంది. ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు ఉంటాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
మురిపించిన లేగ దూడలు.. అమలాపురంలో సందడిగా ఆవు దూడల అందాల పోటీలు!
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
కొత్తిమీరే కదా అని తీసిపారేస్తున్నారా.. అది చేసే అద్భుతం తెలిస్తే
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధంతో భారత్‌లో వంటగ్యాస్‌ కష్టాలు
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
రికార్డ్ స్థాయికి చికెన్ ధరలు.. నాన్ వెజ్ తినేవారికి బ్యాడ్ న్యూస
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
మరో కీలక అప్డేట్‌ వచ్చేసింది!
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
పేరెంట్స్‌కు ఐశ్వర్య రాయ్ చెబుతున్న ‘సక్సెస్ మంత్ర’
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..