Jaggery Benefits: అందుకే బెల్లం తినమని చెప్పేది.. రోజూ తింటే ఆ సమస్యలన్నింటికీ ఇట్టే చెక్ పెట్టొచ్చు..

బెల్లంను చెరకుతోపాటు ఖర్జూరం, కొబ్బరి రసం వంటి ఇతర వనరుల నుంచి కూడా తయారు చేయవచ్చు. ఖర్జూరంతో చేసిన నోలెన్ బెల్లం రుచికరంగా ఉంటుంది.

Jaggery Benefits: అందుకే బెల్లం తినమని చెప్పేది.. రోజూ తింటే ఆ సమస్యలన్నింటికీ ఇట్టే చెక్ పెట్టొచ్చు..
Jaggery Benefits
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 30, 2022 | 6:21 AM

Jaggery Health Benefits: బెల్లంలో అనేక పోషకాలు దాగున్నాయి. బెల్లాన్ని ఆయుర్వేద చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు. బెల్లంతో స్వీట్లు, డెజర్ట్‌లు, అనేక వంటకాలు తయారు చేయడంతోపాటు పలు పదార్థాలలో ఉపయోగిస్తారు. ఈ శుద్ధి చేయని చక్కెరలో అనేక ప్రయోజనాలు దాగున్నాయి. ఇది సాధారణంగా చెరకు రసం నుంచి తయారు చేస్తారు. శుద్ధి చేసిన చక్కెరకు బదులుగా దీనిని ఉపయోగిస్తే ఎన్నో లాభాలు చేకూరుతాయి. బెల్లంను చెరకుతోపాటు ఖర్జూరం, కొబ్బరి రసం వంటి ఇతర వనరుల నుంచి కూడా తయారు చేయవచ్చు. ఖర్జూరంతో చేసిన నోలెన్ బెల్లం రుచికరంగా ఉంటుంది. శీతాకాలంలో డెజర్ట్‌లు, ఇతర వంటకాలను తయారు చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. ఈ బెల్లం నుంచి తయారుచేసిన స్వీట్లు చాలా రుచికరంగా ఉంటాయి. అయితే, బెల్లం సహజంగా ఉండటంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. అవేంటో తెలుసుకుందాం..

బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు..

  1. బెల్లం రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరానికి కలిగే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్‌ను నివారిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని అంటువ్యాధుల నుంచి రక్షిస్తాయి. జలుబు, ఫ్లూ వంటి సాధారణ వ్యాధులను నివారించేందుకు సహాయపడుతుంది.
  2. కాలేయానికి మేలు చేస్తుంది. బెల్లం శరీరం నుంచి టాక్సిన్స్, ఇతర హానికరమైన రసాయనాలను తొలగించడం ద్వారా కాలేయాన్ని నిర్విషీకరణ చేస్తుంది. ఈ లక్షణాలు బెల్లంలో పుష్కలంగా ఉన్నాయి. శరీరం టాక్సిన్స్ లేకుండా ఉన్నప్పుడు కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత బెల్లం తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారించే ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది.
  5. రక్తహీనతతో బాధపడుతున్న వారికి బెల్లం సహాయపడుతుంది. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచడానికి, రక్తహీనత పరిస్థితులను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
  6. రక్తపోటును నివారించడంలో బెల్లం సహాయపడుతుంది. ఇందులోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను నిర్వీర్యం చేయడానికి సహాయపడుతుంది. తద్వారా రక్తపోటును అదుపులో ఉంచుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి