AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fitness Tips: వార్మప్ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదంలో పడినట్లే..

వార్మప్‌ చేయడం ద్వారా శరీరానికి వ్యాయామం చేయడానికి తగిన స్టామినా లభిస్తుంది. దీని వల్ల మీరు ఎక్కువసేపు వ్యాయామం చేయగలుగుతారు.

Fitness Tips: వార్మప్ చేసేటప్పుడు ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే ప్రమాదంలో పడినట్లే..
Fitness
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2022 | 5:38 AM

Share

Body Warm Up Mistakes: ఫిట్‌గా.. ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా అవసరమన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ దానికంటే ముఖ్యమైనది సరైన విధంగా వ్యాయామం చేయడం. ఎందుకంటే కొందరు కొన్నిసార్లు నేరుగా వ్యాయామం చేయడం ప్రారంభిస్తారు. అది పూర్తిగా తప్పు అంటున్నారు ఫిట్నెస్ ఎక్స్‌పర్ట్స్‌.. ఇలాంటి పరిస్థితిలో ఎల్లప్పుడూ వార్మప్‌తో వ్యాయామాన్ని క్రమంగా ప్రారంభించాలి. ఎందుకంటే మెల్లగా వార్మప్‌ చేయడం ద్వారా శరీరానికి వ్యాయామం చేయడానికి తగిన స్టామినా లభిస్తుంది. దీని వల్ల మీరు ఎక్కువసేపు వ్యాయామం చేయగలుగుతారు. కొంతమంది వార్మప్ చేస్తుంటారు, కానీ ఈ సమయంలో వారు కొన్ని పొరపాట్లు చేస్తారు. దానివల్ల అలాంటివారికి వ్యాయామంతో పెద్దగా ప్రయోజనం చేకూరదు. అటువంటి పరిస్థితిలో వార్మప్‌ చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలో ఇప్పుడు తెలుసుకోండి..

ఈ పొరపాట్లు చేయకండి..

వ్యాయామానికి ముందు కొద్దిసేపు వార్మప్‌ చేయండి: ఇతర వ్యాయామాల మాదిరిగా వార్మప్ కూడా చేయడం చాలా ముఖ్యం. కొంతమంది వార్మప్ చేస్తారు కానీ రెండు మూడు నిమిషాలు మాత్రమే చేస్తారు. ఇది తప్పు. మీరు ఎల్లప్పుడూ కనీసం 10 నిమిషాల పాటు వార్మప్ చేయాలి. ఇలా చేయడం ద్వారా మాత్రమే వ్యాయామం చేసిన అనంతరం పూర్తి ప్రయోజనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

స్ట్రేచింగ్ మంచిగా చేయాలి: వ్యాయామానికి ముందు, ఆ తర్వాత వార్మప్ అవసరం. ఫిట్‌నెస్‌గా ఉండాలంటే సరైన విధంగా వార్మప్ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. స్ట్రెచింగ్ చేయడం ద్వారా శరీరం అంతటా రక్తం, ఆక్సిజన్ సరఫరా మెరుగుపడుతుంది. కావున మీరు కూడా వ్యాయామం చేస్తుంటే స్ట్రెచింగ్ సరిగ్గా చేయాలని గుర్తుంచుకోండి.

ప్రతిరోజూ వార్మప్ మార్చడం మంచిది: వ్యాయామం చేసేటప్పుడు ప్రతిరోజూ ఒకే విధంగా వ్యాయామం చేసినట్లే.. ఆ విధంగానే వార్మప్ చేయడం మానుకోండి. చాలా కాలం పాటు అదే విధంగా వార్మప్ చేస్తే.. దాని ప్రభావం క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. అందువల్ల వ్యాయామంతో పాటు, వార్మప్ వ్యాయామంలో కూడా వెరైటీని తీసుకురావడానికి ప్రయత్నించాలి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి