AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది.. నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన

అందం, అభినయంతో తెలుగు చిత్రపరిశ్రమలో సత్తా చాటింది. దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా కలువల్లాంటి కన్నులు.. అందమైన మోము.. సహజనటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ లో ఎంతో సక్సెస్ అయిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుంది.

ఆరోజు అలా చేయకుండా ఉండాల్సింది.. నా జీవితం నాశనం అయ్యింది.. హీరోయిన్ ఆవేదన
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2026 | 7:17 PM

Share

సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్ లో ఈ అందాల ముద్దుగుమ్మ ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది ఆ అందాల తార.. అందం, అభినయంలో తోపు హీరోయిన్. అందంలో శ్రీదేవితో పోటీపడింది ఆ స్టార్ హీరోయిన్. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులోనే కాదు.. హిందీ, తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ పలు చిత్రాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. మరోవైపు రాజకీయంలోనూ రాణిస్తున్నారు. ఎవరో గుర్తుపట్టండి. 14 ఏళ్ల వయసులోనే కథానాయికగా అరంగేట్రం చేసి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

ఆమె అలనాటి అందాల తార జయప్రద. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం.ప్రభాకరరెడ్డి ఈమెను చూసి సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె పేరును జయప్రదగా మార్చారు. 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో కేవలం మూడు నిమిషాలు నిడివిగల పాట కోసం ఆమెను తీసుకున్నారు. అలా మొదలైన సినీ ప్రస్థానం 2005వరకు దాదాపు మూడు దశాబ్దాల వరకు సాగింది.

ఇవి కూడా చదవండి

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

తెలుగుతోపాటు.. కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీలో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. 1986 జూన్ 22న సినీ నిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహం చేసుకున్నారు జయప్రద. సీనియర్ ఎన్టీఆర్ ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో జయప్రద మాట్లాడుతూ.. నేను తీసుకున్న తప్పుడు నిర్ణయం పెళ్లి చేసుకోవడమే అని చెప్పి షాక్ ఇచ్చారు. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నా.. పెళ్లి చేసుకున్న సమయంలో నా వయసు 25 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని, నా కెరీర్‌ను నాశనం చేసిందని జయప్రద తెలిపారు.

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us