Health: సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి చాలు.. డెంగ్యూ, టైఫాయిడ్ లాంటివి దరిచేరవు

వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఈ వ్యాధులు దోమల ద్వారా, అపరిశుభ్రత వల్ల వ్యాపిస్తాయి.

Health: సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఇలా చేయండి చాలు.. డెంగ్యూ, టైఫాయిడ్ లాంటివి దరిచేరవు
Monsoon
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 30, 2022 | 6:25 AM

Prevent Dengue Malaria: వర్షాకాలం ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ సీజన్ లో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సీజన్‌లో కొంచెం అజాగ్రత్త ఉన్నా అనారోగ్యం బారిన పడటానికి ఎక్కువ సమయం పట్టదని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. ఈ వ్యాధులు దోమల ద్వారా, అపరిశుభ్రత వల్ల వ్యాపిస్తాయి. అందుకే ఈ సీజన్‌లో రోగాలు రాకుండా పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా బయటి ఆహారాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు.

వర్షాకాలంలో ఈ విషయాలను గుర్తుంచుకోండి

దోమలను నివారించండి: డెంగ్యూ, మలేరియాను నివారించడానికి దోమలను నివారించడం చాలా ముఖ్యం. ఈ సీజన్‌లో ఉదయం లేదా సాయంత్రం ఫుల్ స్లీవ్‌లతో కూడిన దుస్తులను ధరించండి. తద్వారా దోమలు కుట్టడాన్ని నివారించవచ్చు. ఇది కాకుండా మోస్కాటో కాయిల్ (దోమల కాయిల్) మొదలైనవాటిని ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల దోమల బెడద నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.. కానీ మంచిది కాదు. శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. అందుకే ఇంట్లోకి దోమలను వివారించడానికి ప్రయత్నించండి. ఇంకా దోమ తెరలు లాంటివి ఉపయోగించండి.

ఇవి కూడా చదవండి

వ్యాయామం: రెగ్యులర్ వ్యాయామం ఆరోగ్యకరమైన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వ్యాయామం కోసం రోజులో 30 నిమిషాలు కేటాయించాలి. ఇది మిమ్మల్ని రోజంతా చురుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా రోజూ వ్యాయామం చేయడం వల్ల వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఎందుకంటే వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల ఏ వ్యాధి కూడా సులభంగా వ్యాపించదు. మరోవైపు, మీరు వర్షాకాలంలో బయట నడకకు వెళ్లలేకపోతే ఇంట్లోనే కొంచెంసేపు వ్యాయామం చేయండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి