AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ

మంచు మనోజ్ నటించిన ఝుమంది నాదం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది ముద్దుగుమ్మ తాప్సీ. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తాప్సీ తన అందంతో అభినయంతో కట్టిపడేసింది. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి అలరించింది తాప్సీ.

ఆ స్టార్ హీరో నన్ను రిజెక్ట్ చేశాడు.. షాకింగ్ విషయం బయట పెట్టిన తాప్సీ
Taapsee
Rajeev Rayala
|

Updated on: Mar 17, 2026 | 10:30 PM

Share

తాప్సీ పన్ను.. ఝుమ్మంది నాధం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‏గా పరిచయమైంది తాప్సీ పన్నూ. ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. టాలీవుడ్‏లో ఈ ముద్దుగుమ్మకు ఎక్కువే పాపులారిటీని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత తెలుగులో వరుసు హిట్ సినిమాలను చేస్తూ అగ్ర కథానాయికలలో ఒకరిగా వెలిగింది తాప్సీ. అయితే ఇక్కడ వరుస సినిమాలు చేస్తునే.. ఆకస్మాత్తుగా బాలీవుడ్‍కు షిఫ్ట్ అయింది తాప్సీ. అయితే అక్కడ వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ తానేంటో నిరూపించుకుంది. అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా మారిపోయింది. అటు వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ రంగంలోనూ సత్తా చాటుతుంది..

Pawan Kalyan: రాజకీయాల్లోకి రావచ్చుగా.. హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ ఆఫర్.. కానీ ఆమె ఏం చెప్పిందంటే

ఇక హిందీలో ఈ చిన్నది తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. అక్కడ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటడ్ సినిమాలు చేసి మెప్పించింది. అంతే కాదు షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించిది ఈ ముద్దుగుమ్మ. అలాగే పలు వివాదాల్లోనూ చిక్కుకుంది. హిందీలో తాప్సీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే..గతంలో తాప్సీ చేసిన కొన్ని షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. హీరోయిన్లకు పేరు వచ్చే సినిమాల్లో నటించేందుకు చాలా మంది హీరోలు ఇష్టపడరని తెలిపింది.

ఇవి కూడా చదవండి

వెంకటేష్ నా ప్రాణం కాపాడారు.. ఆ రోజు ఆయన లేకపోయి ఉంటే వామ్మో..!!

సినిమాల్లో పురుషాధిక్యత గురించి ఆమె మాట్లాడుతూ.. ఒక సినిమాలో తనది డబుల్ రోల్ అని.. ఆ సినిమాలో హీరో పాత్ర కోసం ఒక నటుడిని నిర్మాతలు సంప్రదించారని.. అయితే ఆ హీరో ఒప్పుకోలేదని చెప్పింది. నిజానికి ఆయన తనతో అంతుకుముందే ఒక సినిమాలో నటించారని తెలిపింది. ఆయన పెద్ద స్టార్ అని.. అయినా తనతో నటించడానికి ఆయన అభద్రతగా ఫీల్ కావడం బాధాకరమని తెలిపింది. ఒకట్రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదని చెప్పింది… ప్రేక్షకుల మార్కులు హీరోయిన్ పాత్రకు పడతాయనే వారు ఆ సినిమా చేయడానికి ఇష్టపడలేదని సంచలన విషయాలను బయటపెట్టింది తాప్సీ. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.

Roja Selvamani: స్టార్ హీరో ఇంటికి కోడలిగా రోజా కూతురు..? ఇదిగో క్లారిటీ

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us