Andhra Pradesh: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి.. దాతలకు చంద్రబాబు పిలుపు

గోదావరి (Godavari) వరదలతో సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాలని దాతలను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను...

Andhra Pradesh: వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి.. దాతలకు చంద్రబాబు పిలుపు
Chandrababu
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 30, 2022 | 5:24 PM

గోదావరి (Godavari) వరదలతో సర్వం కోల్పోయిన వారికి సహాయం చేయాలని దాతలను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన.. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆరోపించారు. వారికి తమ వంతు సహాయంగా దాతలు ముందుకు వచ్చి కూరగాయలు, బియ్యం దానం చేయాలని కోరారు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న సొమ్మంతా వరదల్లో కొట్టుకుపోయిందని, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నిస్సహాయ స్థితిలో సహాయం కోసం అర్థిస్తున్నారని చెప్పారు. మేత లేక పశువులు, కూరగాయలు, బియ్యం లేక జనం దుర్భర స్థితిలో కట్టుబట్టలతో మిగిలారని పేర్కొన్నారు. ఇళ్లలోకి బురద చేరి వస్తువులు పాడయ్యాయని, వారిని సమాజంతో పాటు మానవతావాదులు, దాతలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు ముందడుగు వేయాలని కోరారు. పశువులకు ఎండుగడ్డి కొరత ఏర్పడిందని, వాటికి పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డినీ అందించాలని దాతలను అభ్యర్థించారు.

కాగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఫ్యాన్ స్విచ్ బంద్ చేసి, సైకిల్ కు అధికారంలోకి తీసుకురావాలని కోరారు. అలా చేస్తే నే బాధితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. కేసుల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడతున్నారని, పోలవరం ఆలస్యానికి ఏపీ ప్రభుత్వమే కారణమని కేంద్రం చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేనని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే పోలవరం పూర్తి చేసి, నిర్వాసితులకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని చంద్రబాబు వెల్లడించారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..