Tirumala Srivari Hundi: శ్రీవారి హుండీ ఆదాయం ఆల్‌టైమ్‌ రికార్డ్ బ్రేక్.. రూ.వందకోట్లు దాటింది..!!

కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో పాటు.. హుండీలో కాసుల వర్షం కురిస్తోంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది.

Tirumala Srivari Hundi: శ్రీవారి హుండీ ఆదాయం ఆల్‌టైమ్‌ రికార్డ్ బ్రేక్.. రూ.వందకోట్లు దాటింది..!!
TTD
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2022 | 7:11 PM

Tirumala Srivari Hundi : క‌లియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడు. వడ్డీకాసుల వాడిగా వెలుగొందుతున్న తిరుమల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు దేశ విదేశాల నుండి త‌ర‌లి వ‌స్తుంటారు. భక్తుల రద్దీతో పాటుగానే శ్రీవారి హుండీ ఆదాయం కూడా అదే స్థాయిలో కళకళలాడుతూ ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తడంతో పాటు.. హుండీలో కాసుల వర్షం కురిస్తోంది. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. ఆల్‌టైమ్‌ రికార్డ్ బ్రేక్ చేసింది.

ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం 120 కోట్లు దాటుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. అయితే టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా జులై నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 29 రోజులకే 131 కోట్ల 76 లక్షలు రావడంతో…. గత రికార్డులను తిరగరాసి ఆల్ టైమ్ రికార్డ్ నమోదయ్యింది. టిటిడి వార్షిక బడ్జెట్ 3 వేల కోట్లు కాగా, ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయమే 1500 కోట్లు దాటుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే,ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న పవిత్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 1న ప్రత్యేక టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఈ మేరకు 600 టికెట్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజ‌నం, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నామని టీటీడీ అధికారులు వివరించారు. భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!