Funny Video: మిఠాయి కోసం మరదలితో మండపంలోనే వరుడి కొట్లాట.. షాక్‏లో పెళ్లి కూతురు..

దాంతో అందరూ షాక్‌ అయినట్టుగా ఒకరి ముఖాలు ఒకరు బిత్తరపోయి చూసుకున్నారు. వరుడి నోటికి మిఠాయి తినిపించబోయిన అమ్మాయి ఉన్నట్టుండి..

Funny Video: మిఠాయి కోసం మరదలితో మండపంలోనే వరుడి కొట్లాట.. షాక్‏లో పెళ్లి కూతురు..
Amazing
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 30, 2022 | 4:49 PM

Viral Video:పెళ్లిలో రకరకాల ఆసక్తికర సంఘటనలు జరగడం సర్వసాధారణం. అలాంటి ఘటనలు అందరినీ ఎంతగానో అలరిస్తుంటాయి.. దేశంలోని వివిధ మూలల్లో వివాహాలకు వేర్వేరు ఆచారాలు ఉన్నాయి. పెళ్లి జరిగే ఇంట్లో వాతావరణం చాలా సందడిగా ఉంటుంది. కొన్నిసార్లు బావమరదళ్లు, బావభామ్మర్దుల ఆటపట్టించుకోవటాలు పెళ్లిలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయి. ఇక స్నేహితులు చేసి సరదా మామూలుగా ఉండదు.. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని వారు ఓ ఆటాడేసుకుంటారు. ఇక వివాహం తంతులోనూ కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివాహ వేడుక ముగిసిన తర్వాత వధూవరులు కుర్చీపై కూర్చున్న వీడియోను మీరు చూడవచ్చు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో జయమాల వేడుక ముగించుకుని వధూవరులు కుర్చీలో కూర్చున్న దృశ్యాన్ని చూడవచ్చు. పెళ్లికూతురు చెల్లెలు సీన్‌లోకి వచ్చేసరికి వధూవరులిద్దరూ కాస్త రిలాక్స్‌ అవుతున్నట్టు చూడొచ్చు. పెళ్లికొడుకుకు స్వీట్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. వారిలో ఒకరు పెళ్లికొడుకుకు స్వీట్లు ఇచ్చేందుకు ముందుకు వస్తారు. కెమెరా వైపు చూస్తుంటే పెళ్లికొడుకుకు స్వీట్లు ఇచ్చేందుకు మరదలు ముందుకు వచ్చింది. అయితే, ఇక్కడ కాసేపు పెళ్లికొడుకును టీజ్‌ చేద్దామని భావించిన ఆ యువతి..నోటికి స్వీట్‌ అందించినట్టుగా చేసి వెనక్కి లాగేసుకుంటుంది. అలా రెండు సార్లు చేయగానే ఆ వరుడు ఇక లాభం లేదని, ఆ అమ్మాయి చేయిపట్టుకుని స్వీట్‌ తినబోయే ప్రయత్నం చేశాడు..దాంతో అక్కడ ఊహించని ఘటన జరుగుతుంది. అది చూసి అక్కడున్నవారంతా అవాక్కైపోయారు. దాంతో అందరూ షాక్‌ అయినట్టుగా ఒకరి ముఖాలు ఒకరు బిత్తరపోయి చూసుకున్నారు. వరుడి నోటికి మిఠాయి తినిపించబోయిన అమ్మాయి ఉన్నట్టుండి అతడి మీద పడిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు వీడియోలో చూడొచ్చు..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

ముద్దు పెట్టిన చోటే స్వీట్ ఇవ్వడం చూసి అక్కడ గుమికూడిన బంధువులు, స్నేహితులు ఒక్కసారిగా నవ్వుకున్నారు. పెళ్లికూతురు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. తొలుత షాక్‌కు గురైన పెళ్లికొడుకును వీడియోలో చూడొచ్చు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన రీతిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా bhutni_ke_memes ద్వారా అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ